Featured

అనసూయ పద్ధతిగా చేస్తానంటే.. ఎవ్వరూ చూడట్లేదట.. ఎందుకనబ్బా..??

బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న అనసూయకు ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసే ఈ ముదురు హాట్ బ్యూటీకి ప్రస్తుతం వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. రోజుకు రెండు లక్షల వరకూ ఇస్తామంటున్నారు మేకర్స్. పైగా ఆమె సిబ్బందికి, అలాగే మిగిలిన చిల్లర ఖర్చులు అవి ఇవి కలిపి మొత్తంగా రెండు లక్షల ముప్పై వేలు వరకూ రోజుకు అనసూయకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. తానూ డిమాండ్ చేస్తే.. ఆ రెండు కాస్త మూడు అవుతుంది. అంటే.. అనసూయ ఈజీగా రోజుకు మూడు లక్షలు సంపాదించొచ్చు. పైగా కష్టం కూడా పెద్దగా లేదు.

అదే యాంకరింగ్ అయితే, గంటలు గంటలు అరవాలి, పైగా ఇచ్చేది రోజుకు లక్ష రూపాయిలు, అన్నిటికి మించి ఆ లక్ష రూపాయిలకే మళ్ళీ స్టేజి మీద ఒక సాంగ్ కి డ్యాన్స్ చేయాలి.. అదనంగా ఎక్స్ పోజింగ్ కూడా చేయాలి. ఇదంతా అనసూయకి శ్రమదోపిడిలా అనిపిస్తోందట. అంతే కాదు, ఈ మధ్య స్టేజ్ మీద డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ను పెట్టి, తనలోని సెక్సీ హావభావాలను రాబట్టుకుంటూ టీవీ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు తప్ప, తనకు వస్తోంది ఏమిలేదు అంటూ అమ్మడు తెగ ఫీల్ అయిపోతుందట. పైగా తానూ ఇలాగే కొంతకాలం యాంకరింగ్ పేరుతో డ్యాన్స్ షోలు చేస్తే.. ఇక ఆ తరువాత సినిమాలోని ఐటమ్ సాంగ్స్ లో చూపించడానికి తనలో ఏమి ఉండదు అని అనసూయ ఫీల్ అవుతుందట.అందుకే ఇక నుండి యాంకరింగ్ లో హద్దులు దాటను అని, అలాగే తానూ వేసుకొనే దుస్తులు కూడా తానే తెచ్చుకుంటాను అని, దయచేసి ఎక్స్ పోజింగ్ విషయంలో తనను ఇబ్బంది పెట్టొద్దు అని, అనసూయ టీవీ మేకర్స్ కి క్లారిటీ ఇచ్చిందట.

హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న తరువాత.. పద్దతిగా యాంకరింగ్ చేస్తాను అంటే.. ఎవ్వరూ చూస్తారమ్మా.. యూత్ లో నీకు ఉన్న ఫుల్ క్రేజ్ కేవలం నీ హాట్ హాట్ లుక్స్ అండ్ నీ ఎక్స్ పోజింగ్ చూసే. ఈ రోజు కుర్రాళ్లకు నువ్వు నచ్చుతున్నావ్ అంటే.. అది నీలోని బ్యూటీ చూసే. నువ్వు ఇలాగే డ్రీమ్ గర్ల్ గా ఉండాలి అంటే.. బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోవాలి అంటూ ఆమెకు సలహాలు ఇస్తున్నారట ఆయా ప్రోగ్రామ్స్ అధినేతలు..దీంతో అనసూయ పద్ధతి గా ఉండాలా.. లేక ఎక్సపోజింగ్ చేయాలో అర్థం కాక సతమతమవుతుందట…!!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago