Megastar Chiranjeevi : చిరంజీవి ఈ సీనియర్ హీరోయిన్స్ తో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.!!

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ నలుగురు సీనియర్ హీరోయిన్స్ తో నటించిన చిత్రాలు.. “వేట” 1986లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, జయప్రద, సుమలత ముఖ్య పాత్రలు పోషించారు. చిరంజీవి కథానాయకుడిగా విజయవంతమైన ఖైదీ అనే సినిమాను నిర్మించిన సంయుక్త మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Megastar Chiranjeevi : చిరంజీవి ఈ సీనియర్ హీరోయిన్స్ తో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.!!

ఈ సినిమాకు 1844 లో అలెగ్జాండ్రి డ్యూమాస్ రచించిన ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో (The count of Monte Cristo) అనే నవల ఆధారం. ఈ చిత్రానికి రచన పరుచూరి బ్రదర్స్. సంగీతం కె. చక్రవర్తి. వి. ఎస్. ఆర్ స్వామి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించగా వెల్లై స్వామి ఎడిటింగ్ చూసుకున్నాడు.

“నకిలి మనిషి” 1980లో విడుదలైన తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసారు. సంగీత, సునీత మరియు సత్యనారాయణ నటించారు. ఈ చిత్రం 1 ఆగస్టు 1980న విడుదలైంది. చిరంజీవి, సంగీత ఈ ఒక్క చిత్రంలో కలిసి జోడి కట్టారు. సినిమా కథను గమనిస్తే…

మధ్యతరగతి వ్యక్తి అయిన ప్రసాద్ ( చిరంజీవి ) నిజాయితీ కారణంగా ఉద్యోగం కోల్పోతాడు. ఉద్యోగం చేయలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, డబ్బు కోసం చనిపోవడానికి అంగీకరించాడు. అతనికి చావడానికి పనికి వచ్చే రమ (సునీత) దానికి డబ్బు చెల్లిస్తుంది. కానీ చివరి నిమిషంలో, ప్రసాద్ జీవించాలనుకుంటున్నాడు మరియు గంగరాజు ( సత్యనారాయణ), అతను సురక్షితమైన స్థలంలో దాక్కున్నాడు. ప్రసాద్‌లా కనిపించే శ్యామ్ (చిరంజీవి) ఆస్తి కోసం రాముడి సహాయంతో గంగాధర్ రావును హత్య చేసి డబ్బు దాచేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా సినిమా కథాంశం.

హిందీ లో విజయవంతమైన ‘ముకద్దర్ కా సికందర్’ కి తెలుగు పునర్నిర్మాణమే “ప్రేమ తరంగాలు” చిత్రం. అమితాబ్ బచ్చన్ పాత్రని కృష్ణంరాజు, వినోద్ ఖన్నా పాత్రని చిరంజీవి, రాఖీ పాత్రని సుజాత పోషించారు. సంక్షిప్తంగా కథ గమనిస్తే..
చిన్న వయసులో వేధింపులకు గురైన చిన్న పిల్లవాడు, విజయ్ రంగారావు ( కాంతారావు ) అనే సంపన్నుడి ఇంట్లో పనిచేస్తూ పగలు మరియు రాత్రి బానిసలుగా జీవించడానికి కష్టపడతాడు. రంగారావుకి అతనంటే ఇష్టం లేదు. గతంలో మరో అనాథ అతని దయను ఉపయోగించుకున్నాడని, అందుకే అతని శత్రుత్వం బయటపడిందని తరువాత తెలుస్తుంది.ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా సినిమా కథాంశం.

“పార్వతి పరమేశ్వరులు” చిరంజీవి, చంద్రమోహన్, ప్రభ, స్వప్న నటించిన 1981 నాటి తెలుగు చిత్రం. పల్లవీ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్. కోటారెడ్డి దర్శకత్వంలో ఎస్. వెంకటరత్నం నిర్మించాడు. చిరంజీవి ప్రభ కలిసి ఈ ఒక్క చిత్రంలో మాత్రమే నటించారు. చిరంజీవి ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. జయప్రద, సుజాత, సంగీత, ప్రభ వంటి సీనియర్ హీరోయిన్స్ తో చిరంజీవి నటించిన ఈ నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని పొందాయి.