NTR : సినిమారంగంపై మక్కువతో చిత్రసీమలో అడుగు పెట్టిన వడ్డే రమేశ్ మొదట ‘సున్హేరా సంసార్’ అనే హిందీ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఘనవిజయం సాధించిన పండంటి కాపురం ఆధారంగా ఆదుర్తి సుబ్బారావు దర్శత్వంలో ఈ హిందీ చిత్రం రూపొందింది. తెలుగులో ఆయన నిర్మించిన తొలిచిత్రం పాడవోయి భారతీయుడా. తరువాత అక్కినేని హీరోగా ఆత్మీయుడు నిర్మించారు. దాసరి దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా రమేశ్ నిర్మించిన ‘కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ’ చిత్రాలు అద్భుత విజయం సాధించాయి. ఈ చిత్రాల విజయంతో తన ప్రస్థానాన్ని అప్రహతిహతంగా కొనసాగించారు. తన కుమారుడు నవీన్ హీరోగా నటించిన “లవ్ స్టోరీ99” చిత్రానికి వడ్డే రమేశ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
“కలహాల కాపురం”, “తిరుగుబాటు”, “దుర్గాదేవి”, “ఏడుకొండల స్వామి” వంటి చిత్రాలనూ ఆయన నిర్మించారు. దాసరి నారాయణరావుతో రమేశ్ బంధం విడదీయలేనిది. దాసరి దర్శకత్వంలో ఎన్ని చిత్రాలు నిర్మించినా ‘బొబ్బిలిపులి’ చిత్ర నిర్మాతగా జనం మదిలో ముద్ర వేశారు.. అయితే ఈ బొబ్బిలిపులి చిత్ర నిర్మాణం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం.. అక్కినేని నాగేశ్వరరావుతో “ఆత్మీయుడు” చిత్రం తర్వాత వడ్డే రమేష్ ఎన్టీఆర్ తో కూడా ఒక చిత్రాన్ని తీయాలనుకున్నారు. ఆ క్రమంలో ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రావాలని సంకల్పించారు. ఇక సినిమాలకు దూరం కావలసి వస్తుందేమో అని ఒక చిత్రాన్ని తీసి రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వెళ్లిపోవాలనుకున్నారు.. సినీ ప్రముఖులు, అభిమానులతో ఎన్టీ రామారావు గృహం సందడితో నిండిపోయింది. అయితే వడ్డే రమేష్ సినిమా నిర్మించాలనడంతో ఎన్టీ రామారావు, దాసరికి ఫోన్ చేసి పిలిపించారు. సొంత కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను కాదనుకొని దేశం కోసం జీవితాన్ని అర్పించే జవాను కథతో సినిమా రూపొందించాలనుకున్నారు.
ఆ కథ కూడా ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఆనాటి సాంఘిక అంశాలను జోడిస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ తో దర్శకుడు దాసరి కథను సిద్ధం చేశారు. 1981 ఆగస్టు1 నటి మంజుల ఇంట్లో అట్టహాసంగా బొబ్బిలిపులి చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. 1982 ఏప్రిల్ 7న బొబ్బిలిపులి చిత్రం విడుదల కావాలి.. కానీ అప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకటన జరిగి ఆంధ్రప్రదేశ్ లోని 294 స్థానాల అభ్యర్థుల ఎంపికలో ఎన్టీ రామారావు నిమగ్నమయ్యారు. 1982 మార్చి 31న సినిమా విడుదల కోసం వడ్డే రమేష్ చెన్నై సెన్సార్ బోర్డుకి అప్లికేషన్ పెట్టుకున్నారు. తను నటిస్తున్న 294వ చిత్రం బొబ్బిలిపులి అనేక సెన్సార్ అవరోధాలను ఎదుర్కొని చిట్టచివరికి ఎట్టకేలకు 1982 జులై 9న విడుదలై… బొబ్బిలిపులి చిత్రంలోని సన్నివేశాలు నాటి జీవన విధానాలను ప్రభావితం చేసేలా ఉండడంతో ఆ సినిమా ఆంధ్రదేశమంతటా ఒక ఊపు ఊపింది. ఆ విజయం ఎన్టీ రామారావును 9 నెలలు తిరగకుండానే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…