MLA Undavalli Sridevi : నాకు ప్రాణహాని ఉంది… అప్పటివరకు ఏపీకి రాను… జగనన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా…: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

MLA Undavalli Sridevi : ఏపీ లో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కి పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో వైసీపీ పార్టీ ఆమెను సస్పెండ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే సస్పెండ్ అయ్యాక శ్రీదేవి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకుల అవినీతి చిట్టా విప్పారు. ఇక వైసీపీ నేతలు కూడా శ్రీదేవి అవినీతికి పాల్పడిందంటూ ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలు పెట్టరు. అయితే ఇక ఉండవల్లి శ్రీదేవి కూడా వరుసగా మీడియాలో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన వెర్షన్ కూడా చెబుతున్నారు.

నాకు ప్రాణహాని ఉంది…

ప్రస్తుతం ఏపీ లో లేకుండా హైదరాబాద్ ఉన్న ఉండవల్లి శ్రీదేవి తనకు ప్రాణ హాని ఉందని అది కూడా జగన్ కి సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణ రెడ్డి వల్లే అంటూ మీడియాకు చెప్పారు. కడపలో తాజాగా ఒక వెటర్నరీ డాక్టర్ శవమై బావిలో తేలాడని, ఇలా డాక్టర్లను అందునా దళిత డాక్టర్స్ ను టార్గెట్ చేస్తున్నారంటూ అందుకే ఏపీకి రానని తెలిపారు. నాకు కుటుంబం ఉంది, నా ప్రాణం నాకు కావాలి, అందుకే నాకు అక్కడ రక్షణ ఉంది అన్నపుడే ఏపీకి వస్తాను అంటూ చెప్పారు. జగన్ గారిని మీట్ అయి వచ్చాక ఎమ్మెల్సి ఎన్నిక అయిపోగానే మా ఇంటి వద్ద చాలా మంది తిరుగుతున్నారు, రెక్కి నిర్వహిస్తున్నారు అందుకే హైదరాబాద్ వచ్చేసాను. ఇక్కడ స్నేహితుల ఇంటికి వెళ్లాల్సి వస్తోంది అంటూ తెలిపారు.

ఇక జగన్ గారు పిలిచి టికెట్ ఇచ్చి రాజకీయాల్లోకి ఆహ్వానించారు ఆరోజే నేను అనుకున్నాను అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని. ఇస్లాం, క్రిస్టియనిటీ, హిందూ ఇలా ఏ మతంలో అయినా దేవుడు మనకు ఏదైనా ఇస్తే అందుకు బదులుగా బలి ఇవ్వడం లేక ఏదైనా సమర్పించడం చేస్తాం. అలానే నేను నా కూతురుని ఐఏఎస్ చదివించి ఏపీ లో జగన్ గారి వద్ద సలహాదారుగా పనిచేయించాలని అనుకున్నాను. అలా అన్న ఋణం తీర్చుకోవాలని అనుకున్నా కానీ పార్టీ నుండి నన్ను వెళ్లగొట్టారు అంటూ ఉండవల్లి శ్రీదేవి అభిప్రాయాపడ్డారు.