Ramcharan: సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వారు ధరించే బట్టలు చెప్పులు దగ్గరినుండి వారు నివసించి ఇల్లు తిరిగే కార్లు అన్నీ కూడా చాలా కాస్ట్లీ గా ఉంటాయి. ఎవరి ఇమేజ్ కి తగ్గట్టు వారు లగ్జరీగా జీవిస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీల లగ్జరీ లైఫ్, వారు ఉపయోగించే వస్తువుల ధరలు గురించి తెలిస్తే సామాన్య ప్రజలు నోరెళ్లబెడతారు.
ఇదిలా ఉండగా ఇటీవల పుట్టినరోజు సందర్భంగా రాంచరణ్ ధరించిన షర్టు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దీంతో ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా రామ్ చరణ్ కి అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.
ఇక తాజాగా మార్చి 27వ తేదీ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సౌత్ ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు ధరించిన దుస్తులు, వస్తువులు , బ్యాగులు, వారు తిరిగే కార్లు ఇలా అన్నింటి వివరాల గురించి తెలుసుకోవటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ముఖ్యంగా సెలబ్రెటీలు ధరించే దుస్తుల ధరల గురించి తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో పుట్టినరోజున రాంచరణ్ ధరించిన షర్టు గురించి కూడా సెర్చ్ చేశారు. ఆ షర్ట్ ఖరీదు చూసి షాక్ అవటం వారి వంతయింది.
బర్త్డే పార్టీలో రామ్ చరణ్ లైట్ బ్లూ కలర్ లో ప్యాచ్ వర్క్ తో షర్ట్ తో కనిపించాడు. రామ్ చరణ్ ధరించిన షర్ట్ ధర గురించి సెర్చ్ చేయగా.. ఫార్ ఫెచ్ అనే షాపింగ్ వెబ్ సైట్ లో కనిపించింది. జున్యా వటనాబి ప్యాచ్ వర్క్ డీటైల్ షర్ట్ పేరుతో అందుబాటులో ఉంది. ఈ షర్ట్ ఖరీదు 983 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.80,961 ఆ షర్ట్ ఖరీదు చూసి అభిమానులు షాక్ అయ్యారు. సెలబ్రిటీలు వారి స్థాయికి తగ్గట్టు ఇలాంటి ఖరీదైన బట్టలు ధరించడం సర్వ సాధారణం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…