Movie News

Actress Jayalalitha: ఆ డైరక్టర్ యాసిడ్ పోసి చంపేస్తానన్నాడు..నటి జయలలిత!

Actress Jayalalitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందిన సీనియర్ నటి జయలలిత గురించి తెలియనివారంటూ ఉండరు. నెగిటివ్, పాజిటివ్ పాత్రలతో పాటు కామెడీ పాత్రలలో కూడా నటించి తెలుగు, తమిళ్, కన్నడ,మలయాళీ వంటి భాషలలో కొన్ని వందల సినిమాలలో నటించి సినిమా ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు పొందిన జయలలిత వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా కష్టాలు అనుభవించింది.

నమ్మివారే దారుణంగా మోసం చేయటంతో ఆర్థికంగా చాలా నష్టపోయింది. ఇక ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవి సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయలలిత తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకునే భర్త తనని ఎన్ని చిత్ర హింసలకు గురిచేశాడో చెబుతు ఎమోషనల్ అయ్యింది.

ఈ ఇంటర్వ్యూలో జయలలిత మాట్లాడుతూ” వినోద్ అనే ఒక మలయాళ డైరెక్టర్ ను ఏడేళ్ల పాటు ప్రేమించి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా వారిని పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్ళి జరిగిన వారం రోజులకే నాకు కష్టాలు మొదలయ్యాయి. ఆయన్ని పెళ్లి చేసుకోవద్దని చలపతి రావు, జయకృష్ణ గారు ఎంతో చెప్పి చూశారు. కానీ ప్రేమ గుడ్డిది కదా . అందుకే వారి మాటలు వినిపించుకోలేదు. నేను పెళ్లి చేసుకోకపోతే ఆయన విషం తాగి చనిపోతానని బెదిరించడంతో నిజమైన ప్రేమ అనుకుని నమ్మి పెళ్లి చేసుకున్నా.

Actress Jayalalitha: గదిలో బంధించారు..

అయితే నా కుటుంబసభ్యులకు ఆ పెళ్లి ఇష్టం లేకపోయినా కూడా నాకోసం వచ్చారు. అయితే నాకు పిల్లలు పుట్టిన తర్వాతే నా పేరు మీద ఉన్న ఆస్తి నాకు చెందుతుందని సంతకం చేయించుకున్నారు. మా పెళ్లి జరిగిన వారం రోజులకు ఈ విషయం ఆయనకి తెలియటంతో ఆస్తి తీసుకురమ్మని నన్ను హింసించడం మొదలుపెట్టాడు. అలా నెమ్మదిగా నన్ను హింసిస్తూ ఒక గదిలో బంధించి నా మీద యాసిడ్ పోసి చంపటానికి కూడా ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో చలపతి రావు గారు నన్ను ఆ ఇంటి నుండి బయటకు తెచ్చారు. ఇలా ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా అది మూడు నాలుగు ముచ్చటగానే మిగిలిపోయింది. ఏడాది తిరగకుండానే అతనితో విడాకులు తీసుకొని దూరంగా వచ్చేసాను ” అంటూ జయలలిత చెప్పుకొచ్చింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

2 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

2 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

2 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

2 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

2 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

3 hours ago