M M Sreelekha: ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లయిన సొంత ఇల్లు లేదు…. ఇప్పటికీ అదే ఇంట్లోనే ఉంటున్నా: ఎం ఎం శ్రీలేఖ

M M Sreelekha: ఎం ఎం శ్రీలేఖ పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శ్రీలేఖ కీరవాణి చెల్లెలు అన్న విషయం మనకు తెలిసిందే. ఇలా అన్నయ్య బాటలోనే సంగీత దర్శకురాలిగా ఈమె ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన పాతిక సంవత్సరాలలో దాదాపు ఐదు భాషలలో 80 సినిమాలకు సంగీతం అందించారు.

ఈ విధంగా ఎం ఎం శ్రీలేఖ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ నెల 17 నుంచి వరల్డ్ మ్యూజిక్ టూర్ ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25 దేశాల్లో 25 మంది సింగర్లతో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలోనే ఈ వేడుకను పురస్కరించుకొని హైదరాబాద్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ పాల్గొని శ్రీలేఖ గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ శ్రీలేఖకు చిన్నప్పుడు నేను చూపించిన ఒక్క ఆశ వల్ల తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేడు ఈ స్థాయిలో ఉందని తెలిపారు.ప్రస్తుతం తన అన్నయ్య కీరవాణి ఆస్కార్ రేసులో ఉన్నారు అలాగే శ్రీ లేక కూడా ఆస్కార్ వంటి గొప్ప అవార్డును అందుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

M M Sreelekha: ఆస్తులు కూడా పెట్టలేదు.. అభిమానాన్ని సంపాదించుకున్న…


ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ లేక కూడా మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి పాతిక సంవత్సరాలయింది. ఇలా పాతిక సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఇప్పటికి తనకు హైదరాబాద్ లోక సొంత ఇల్లు కూడా లేదని అద్దె ఇంట్లోనే ఉంటున్నానని ఈమె తెలిపారు.తాను గడిచిన పాతిక సంవత్సరాలలో పెద్దగా ఆస్తులు కూడుబెట్టుకోలేకపోయినా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాను అంటూ ఈ సందర్భంగా తనని ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.