కేంద్రం సంచలన నిర్ణయం..పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త చెప్పింది. లైఫ్ సర్టిఫికెట్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ కోసం నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు గడువును పొడిగించగా కేంద్రం మళ్లీ ఆ గడువును పొడిగించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.

పెన్షన్ తీసుకునే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించాలనే సంగతి తెలిసిందే. కేంద్రం తాజా నిర్ణయం ద్వారా పెన్షన్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీలోగా లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించవచ్చు. కేంద్రం తాజా నిర్ణయం వల్ల పెన్షనర్లు ఇప్పటివరకు సర్టిఫికెట్ ను ఇవ్వకపోయినా పెన్షన్ పొందే సౌకర్యం ఉంది.

కేంద్రం ఇప్పటికే ఒకసారి గడువును పొడిగించగా తాజాగా మరోసారి గడువును పొడిగించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు, పెన్షనర్స్ అసోసియేషన్స్ నుంచి ఎక్కువ సంఖ్యలో వినతులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

దేశంలో కరోనా విజృంభణ వల్ల ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరుతుందని పెన్షనర్లు చెబుతున్నారు. కరోనా నిబంధనల వల్ల పెన్షనర్లు నిబంధనలు పాటిస్తూ బ్యాంకుకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది. కేంద్రం ఆన్ లైన్ లో కూడా లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించే అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే.