పాడి రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. లక్షల్లో ఆదాయం పొందే అవకాశం..?

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్కీమ్ లతో పాటు కొత్త స్కీమ్ లను అమలు చేస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. పాడి రైతులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గోశాల నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దీపావళి పండుగకు పేడలో ప్రమిదలు తయారు చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోంది.

గోమయ దియా పేరుతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా 11 కోట్ల ప్రమిదలు తయారు చేయించి గోశాల నిర్వాహకులను ప్రోత్సహించాలని భావిస్తోంది. దేశంలోని గోశాల నిర్వాహకులు గోవు పేడతో తయారు చేసిన ప్రమిదలు తయారు చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఇలాంటి పథకాన్నిఅమలు చేయడం ఇదే మొదటిసారి. రాష్ట్రీయ కామధేను ఆయోగ్ గోసంతతి వృద్ధితో పాటు గోశాల నిర్వాహకులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.

రోజురోజుకు ఆవు పేడ ప్రమిదలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పాత తరంలో చేతులతో ప్రమిదలు తయారు చేయగా అయితే మెషిన్ తో సులభంగా ప్రమిదలను తయారు చేయడం సాధ్యమవుతుంది. సులభంగా డబ్బులను సంపాదించుకునే అవకాశం ఉంటుంది. రైతులకు ఈ విధంగా లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది. డైరీ ఫాం ఉన్నవాళ్లు కూడా ఆవు పేడతో సులభంగా ప్రమిదలను తయారు చేయవచ్చు.

ప్రమిదలు తయారు చేయాలంటే ఎర్ర మట్టి, బియ్యం పిండి, ఆవు పేడ అవసరం. వీటన్నింటినీ మిక్స్ చేసి మిషన్ లో వేస్తే ప్రమిదలు సిద్ధమవుతాయి. ప్రమిదలను ఎండబెట్టి మార్కెట్ లో విక్రయించి కూడా ఆదాయం పొందవచ్చు. మార్కెటింగ్ చేసుకుంటే మరింత ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.