Featured

నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. డిఫెన్స్ లో భారీగా ఉద్యోగాలు..!

సాధారణంగా ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలో నిరుద్యోగుల సంఖ్యను మరింత పెరగడానికి కారణమైంది. ఇలాంటి సమయంలో దేశంలోని నిరుద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా యూపీఎస్సీ నుంచి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతి సంవత్సరం ఈ ఉద్యోగాలకు యూపీఎస్సీ నుంచి రెండుసార్లు నోటిఫికేషన్లు విడుదలవుతాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 345 ఉద్యోగాల భర్తీ జరగనుంది. నేవీ, మిలిటరీ ఫోర్స్‌, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు ఈ పరీక్ష ద్వారా భర్తీ అవుతాయి. డిగ్రీ పూర్తి చేసిన 25 సంవత్సరాలలోపు వయస్సు వాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులవుతారు. ఈ ఉద్యోగాల ద్వారా భారీ మొత్తంలో వేతనం పొందడంతో పాటు దేశ సేవలో భాగస్వాములయ్యే అవకాశం కూడా లభిస్తుంది. మంచి హోదాతో పాటు ఈ ఉద్యోగం ద్వారా గౌరవం కూడా లభిస్తుంది.

పెళ్లి కాని అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. :https://upsconline.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన కేటగిరీల అభ్యర్థులు మాత్రం 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు రాత పరీక్షతో పాటు ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ, వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago