తన బాల్యం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన సీతాకోక చిలుక అరుణ..

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించిన అప్పటి హీరోయిన్లకు పెద్ద పోటీ ఇచ్చిన హీరోయిన్ ముచ్చర్ల అరుణ. 10 సంవత్సరాల పాటుగా ఆమె 70 చిత్రాలకు పైగా నటించింది. ఇదిలా ఉండగా.. ఈమె ఇటీవల ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘అలీతో సరదాగా’ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ప్రేక్షకులతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

1980లో ఒక తమిళ సినిమా చేసి వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత సీతాకోక చిలుక సినిమాలో నటించి ఆమె ఉత్తమ జాతీయ చిత్రంగా బంగారు నెమలి పురస్కారాన్ని అందుకున్నది. ఈమె ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో జన్మించారు. ఆమె చదువంతా హైదరాబాద్ లోనే సాగింది. ఆమెకు ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నాడు.

ఈమె చదుకుంటున్న రోజుల్లోనే డ్యాన్స్ నేర్చుకున్నారు. మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీలో ఈమెను చూసిన దర్శకుడు భారతీరాజా సినిమాలో నటించమని అడిగాడు. మొదట్లో తటపటాయించినా తర్వాత ఆ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ సినిమానే ‘సీతాకోక చిలుక’. ఈ సినిమా తర్వాతనే సీతాకోక చిలుక అరుణగా మారింది. ఈమెకు 1987 లో జి. మోహన్ తో పెళ్ళయింది.

వీరికి నలుగురు కూతుర్లు. వీళ్లందరికీ కూడా పెళ్లిళ్లు అయినట్లు చెప్పారు. ఇలా తన జీవితం ప్రస్తుతం సాఫీగా సాగిపోతున్నట్లు చెప్పారు. తెలుగులో అరుణ 36 సినిమాలు చేయగా.. తమిళంలో 24, మళయాలంలో 14 , కన్నడంలో మూడు సినిమాల్లో నటించినట్లు తెలిపారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉటుండగా.. ఈమె ఈ మధ్య పోస్టు చేసిన చిత్రాలు, వైరల్ తెగ వైరల్ గా మారాయి. ఇలా తన అభిమానులకు టచ్ లో ఉంటూ పలకరిస్తూ ఉంటుంది అరుణ.