ఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరోయిన్లు తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అందులో సంఘవి కూడా ఒకరు. తమిళం, కన్నడ, తెలుగులో ఆమె 95కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో 45 సినిమాలు.. కన్నడంలో ఆరు, తమిళంలో 44 సినిమాల వరకు చేశారు. ఈమె అసలు పేరు కావ్య రమేష్. 1977 అక్టోబర్ 4 న మైసూరులో ఈమె జన్మించారు.
ఈమె తండ్రి మైసూరు వైద్య కళాశాలలో ఈఎన్ టీ విభాగానికి అధిపతి. ఈమె విద్యాభ్యాసం మైసూరులోని మారి మల్లప్ప పాఠశాలలో సాగింది. సంఘవి యుక్త వయసు నుండే మోడలింగ్ చేయటం ప్రారంభించింది. చిన్నపట్టి నుండే సంఘవి బాల్యనటిగా సినిమాలలో నటించడం ప్రారంభించింది. సంఘవికి ‘సిందూరం’ సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే నంది అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆమె దర్శకుడు సురేష్ వర్మను శివయ్య సినిమా నిర్మాణ సమయములో ప్రేమించి పెళ్ళి చేసుకుని కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. తర్వాత తమిళంలో పలు సీరియళ్లలో నటించారు. ఈ మధ్య ‘అలీతో సరదాగా’ అనే ప్రోగ్రాంలో ఆమె మాట్లాడుతూ.. కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఓ స్టార్ కమెడియన్ తమ్ముడు ప్రేమలేఖలు రాసినట్లు చెప్పారు.
అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు తన రక్తంతో కూడా ప్రేమ లేఖలు రాసినట్లు తెలిపారు. ఎవరు అతడు.. ఎవరు ఆ కమెడియన్ అనగా.. అలీ తమ్ముడు అంటూ సమాధానం చెప్పడంతో. దీంతో ఒక్కసారిగా అలీ షాక్ కు గురయ్యాడు. అవును.. ఖయ్యూమ్ తన జూనియర్ అని.. ఎన్నో సార్లు ప్రేమ లేఖలు పంపించే వాడని కానీ నేను అసలు పట్టించుకునే దానిని కాదని తెలిపింది. ఇలా తనకు అలీ తమ్ముడు ప్రేమ లేఖలు రాసినట్లు ఆ ప్రోగ్రాంలో తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…