టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు తీవ్ర అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలయ్యాడు. గత కొద్దిరోజుల నుంచి డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న నటుడు క్రమంగా అతని శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే అడివి శేష్ ను సరైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అడివి శేష్ అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలయ్యాడన్న విషయం తెలియడంతో అభిమానులు కొంతవరకు ఆందోళన చెందుతూ అతడికి ఏం కాకుండా క్షేమంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
అయితే ప్రస్తుతం అడవిశేషు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది… వైద్యులు ఏమంటున్నారు అనే విషయం గురించి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే నటుడు అడివి శేష్ మేజర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ముంబై టెర్రర్ దాడులలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అదే విధంగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వీటితో పాటు గూడచారి సీక్వెల్ గా గూడచారి 2, హిట్ చిత్రానికి సీక్వెల్ చిత్రంగా హిట్ 2 చిత్రాలలో అడివి శేష్ నటించబోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…