Categories: FeaturedMovie News

భీమ్లా నాయక్ నుంచి మరో అప్డేట్.. ధర్మేంద్ర అంటూ రానా వార్నింగ్.. మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సినిమా అంటే అదో రేంజిలో ఉంటుంది. ఏ చిన్న అప్ డేట్ వచ్చినా తెగ వైరల్ అవుతుంటాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న భీమ్లానాయక్ నుంచి ఒక సాంగ్ విడుదల కాగా అది పెద్ద వైరల్ గా మారింది. కొన్ని మిలియన్లకొద్ది వ్యూస్ కూడా సొంతం చేసుకుంది. ఆ వీడియో యూట్యూబ్ లో పెట్టిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

అయితే ఆ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. అందేంటంటే.. ఈ సినిమాలో దగ్గుపాటి రానా నటిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో డానియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. అయితే తాజాగా రానా రోల్ ఫస్ట్ గ్లింప్స్ ఓ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రానా పంచె ధరించి పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించి మాస్ ఆడియన్స్ కి కేక పుట్టించారు.

అంతేకాదు నిత్యామీనన్‏కు భారీ వార్నింగ్ కూడా ఇచ్చారు. నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. స్టేషన్‏లో టాక్ నడుస్తోంది.. నేనేవరో తెలుసా.. ధర్మేంద్ర.. హీరో అంటూ రానా చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. తర్వాత బ్లాక్ షర్ట్ లో కారుపై నిల్చొని ‘డాని ఎంటర్‏టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ 1’ అంటూ రానా దద్దరిల్లిపోయేలా డైలాగ్స్ చెబుతాడు. దీంతో అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఈ చిత్రానికి సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. దీనికి సంగీతం తమన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్‏కు జోడిగా నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లుగా టాక్. దీనిని 2022 సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు చిత్ర బృందం. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‏టైన్‏మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago