ఫ్యామిలీ హీరోయిన్‌గా అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్న ముచ్చర్ల అరుణ.. కమర్షియల్ సినిమాలకు మాత్రం అసలు పనికిరాలేదు..

సినిమాలు చేసింది పదేళ్లే కానీ 70కిపైగా చిత్రాల్లో నటించింది. ఒకటి కాదు రెండు కాదు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఎన్నో చిత్రాల్లో నటించింది. అందం అందుకు తగ్గ అభినయం ఆమెకు సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవ్వరితోనైనా నవ్వుతూ మాట్లాడే వ్యక్తిత్వం. మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అప్పట్లో తెలంగాణ నుంచి వచ్చిన రెండవ తెలుగు నటి. ఆమె అలనాటి మేటి నటి ముచ్చర్ల అరుణ. పదహారనాల అచ్చతెలుగు అమ్మాయి. 1965లో సెప్టెంబర్ 13న ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో జన్మించింది అరుణ. తన చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. చదువుతో పాటు కళలపైన ఇష్టంతో మ్యూజిక్, డ్యాన్స్ నేర్చుకుంది. అలా ఓసారి మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీలో ఈమెను చూసిన దర్శకులు భారతీరాజు సినిమాల్లో అవకాశం ఇచ్చారు.

జేగంటలు మూవీతో అరంగేట్రం చేసి సీతాకోక చిలుకతో స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న నటి అరుణ. అలుపెరుగని బాటసారిగా నిరంతరం సినిమాలు చేస్తూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. పది సంవత్సరాల కాలంలో 70 సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించారు. సక్సెస్ మార్క్‌ను ను క్రియేట్ చేసుకుంది. 1981లో విడుదలైన సీతాకోకచిలుక చిత్రంతో తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యింది అరుణ. అప్పట్లో ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు  ఉత్తమ జాతీయ చిత్రంగా బంగారు నెమలి పురస్కారాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే తన టాలెంట్‌ ఏంటో నిరూపించింది. అప్పటి టీనేజర్స్ అరుణ అంటే పడిచచ్చేవారు. సినిమాలంటే పెద్దగా తెలియని అరుణ మొదటల్లో కాస్త తటపటాయించింది. 

ఆ తరువాత వచ్చిన అవకాశాలన్నింటిని అందిపుచ్చుకుంది. ఆ తరువాత సినిమాల విషయంలో మంచి స్వింగ్‌లో ఉండేది. చాలా వరకు విజయవంతమైన సినిమాల్లో అరుణ కథానాయకిగాను కీలక పాత్రలు చేసింది. అప్పటిలో అరుణ చాలా బిజీ నటి . ఇక రామారావు గారితో జస్టిస్ చౌదరీ, సినిమాలో కూతురిగా నటించి అందరి కంట కన్నీళ్లు తెప్పించింది. చిరంజీవి చంటబ్బాయి చిత్రంలోనూ చిరుకు అక్కగా నటించింది. స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, జేగంటలు, శ్రీవారికి ప్రేమలేఖ, శ్రీమతి ఒక బహుమతి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ సినిమాల్లో మంచి నటనతో మెప్పించింది.

అప్పట్లో హిట్‌ రేస్‌ లో ఉన్న హీరోయిన్‌లకు సమానంగా అరుణ నటించేది. అయితే విజయశాంతి, రాధ, వంటి తారలు గ్లామర్‌ రోల్స్‌లోనూ ప్రేక్షకులను అలరించడంతో ఈ సీతాకోకచిలుక కాస్త వెనకబడిందనే చెప్పాలి. వారితో సమానంగా ముందుకు సాగలేకపోయింది. ఫ్యామిలీ హీరోయిన్ బ్రాండ్ పడటంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మిగిలిపోయింది. కమర్షియల్ సినిమాలకు పనికిరాలేదు. అయితేనేం నటించిన 10 సంవత్సరాల్లో 70కిపైగా సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.