Devarakonda Brothers-Rashimka: తెలుగు సీని పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా. ఆమె పేరు ప్రస్తుతం క్రష్మికగా మారిపోయింది. నేషనల్ క్రష్ అని ఆమెను కొంతమంది పిలుస్తారు. అలా ఆమె పేరును క్రష్మికగా సంభోదిస్తున్నారు.
అయితే గత కొంత కాలం నుంచి రష్మికకు , విజయ్ దేవరకొండకు మధ్య ఏదో నడుస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. వాటిపై వాళ్లు ఇంత వరకు ఎలాంటి క్లారటీ ఇవ్వలేదు. గీతాగోవింతం సినిమా నుంచి వీళ్లిద్దరు ఎక్కువగా జంటగా తిరుగుతుండటం.. కెమెరాలకు చిక్కడం జరగుతోంది. డిన్నర్లు, డేట్స్ అంటూ.. ఇలా కెమెరాలకు చిక్కడంతో వీరిద్దరు రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇక తాజాగా.. విజయదేవరకొండ సోదరులతో క్రష్మిక సందడి చేస్తున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మికానే ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రత్యేక స్టిల్ ఇచ్చింది. ఆమె వెనుకాల ఉన్న బ్యాక్ గ్రౌండ్ ను పరిశీలిస్తే.. ఆనంద్ దేవరకొండ ఫోటోతో మ్యాచ్ అయ్యింది.
దీంతో న్యూ ఇయర్ వేడుకలను ఆమె విజయ్ దేవరకొండ బ్రదర్స్‌తో జరుపుకున్నట్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. గతంలో రష్మిక మందన్న విజయ్ దేవరకొండ మధ్యలో స్పెషల్ కెమిస్ట్రీ నడుస్తోందని రకరకాల వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. విజయ్ దేవరకొండ వద్ద ఇదే విషయాన్ని ఎన్నో సార్లు ప్రస్తావించగా.. తామిద్దరం మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు కూడా వాళ్లంతా కలిసే న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో మరో సారి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై విజయ్ దేవరకొండ ఈ సారి ఎలా స్పందిస్తాడో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…