Featured

Kajal Aggarwal: త్వరలో మన ముందుకు చిన్నారి ‘చందమామ’..ధ్రువీకరించిన కాజల్ భర్త..!

Kajal Aggarwal Pregnancy: కాజల్ అగర్వాల్ కు పెళ్లైన కొన్ని నెలల తర్వాతనే ఆమె ప్రెగ్నెన్సీ ఆంటూ వార్తలు వచ్చాయి. కానీ వాటిపై అప్పుడు ఎలాంటి క్లారిటీ లేదు.. అది కాక వాళ్లు కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే ప్రస్తుతం ఆమె గర్భవతి అంటూ.. కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు.

Kajal Aggarwal: త్వరలో మన ముందుకు చిన్నారి ‘చందమామ’..ధ్రువీకరించిన కాజల్ భర్త..!

గత ఏడాది అక్టోబర్‌లో తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న కాజల్.. తాజాగా ఓ బిడ్డకు జన్మనిస్తుంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా.. వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

Kajal Aggarwal: త్వరలో మన ముందుకు చిన్నారి ‘చందమామ’..ధ్రువీకరించిన కాజల్ భర్త..!

శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ లో గౌతమ్, కాజల్ కు సంబంధించి ఓ ఫొటోను షేర్ చేస్తూ.. “ఇదిగో 2022.. నిన్నే చూస్తున్నా..” అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఆ క్యాప్షన్ తర్వాత ప్రెగ్నెన్సీకు సంబంధించిన ఎమోజీలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టు చూడగానే ఆమె అభిమానులతో పాటు.. నెటిజన్లు అభినందనలు తెలియజేయడంతో కామెంట్ బాక్సులో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఇక కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గతంలోనే ఆమె గర్భంతో ఉన్నానని.. ఆచార్య నిర్మాతలకు తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్‌ని వీలైనంత త్వరగా ముగించే ఆలోచనలో కూడా ఉన్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇండియన్ 2 నుంచి తప్పుకున్న కాజల్..?

అయితే అప్పుడు ఈ విషయం ఆమె వాళ్లకు చెప్పిందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం వాళ్లు కన్ఫామ్ చేసేశారు. చిరంజీవి సరసన కాజల్.. ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె తదుపరి చిత్రం ఇండియన్ 2.. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి. క్వీన్ రీమేక్ “పారిస్ పారిస్”లో కూడా ఆమె నటిస్తోంది. మహమ్మారి కారణంగా ఈ రెండు సినిమాలు ఇప్పటికే రెండేళ్లకు పైగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం, కాజల్ చిరంజీవి ఆచార్య, హే సినామిక , వెంకట్ ప్రభు వెబ్ సిరీస్‌లతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago