Manas-Priyanka: బిగ్ బాస్ సీజన్ -5 ముగిసి వారాలు గడుస్తున్నా… ఇంకా ఆడియన్స్ ఆ మానియాలోనే ఉంటున్నారు. బిగ్ బాస్ 5 సీజన్ లో వీజే సన్నీ విజేతగా నిలువగా… ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ రన్నరప్ గా నిలిచారు.
బిగ్ బాస్ లో షన్నూ గెలుస్తాడని అనుకుంటున్నప్పటికీ, సిరితో రొమాన్స్ షన్నూ కొంప ముంచింది. సిరి- షన్నూల ఎపిసోడ్స్ సీజన్ కే హైలెట్ గా నిలిచాయి. దీంతో పాటు శ్రీరామ్ చంద్ర- హమీదా జోడితో పాటు మానస్- ప్రియాంకల జోడీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో మిస్టర్ కూల్ గా అందరి మన్ననలు పొందింది మాత్రం మానస్.
సన్నీ- మానస్ ల ఫ్రెండ్ షిప్ కూడా షోకు హైలెట్ గా నిలిచాయి. మానస్ తన ఆటతీరుతో ఎంతో మంది ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు తెగ నచ్చేశాడు మానస్. తన మెచ్యూర్డ్ ఆట తీరుతో అందర్ని ఆకట్టుకున్నాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన మానస్, బిగ్ బాస్ షో ద్వారా మరింత మందికి దగ్గరయ్యాడు.
అయితే మానస్ తో ప్రియాంకతో లవ్ ట్రాక్. మాసస్ పై ఎన్నోసార్లు ఇష్టాన్ని ప్రదర్శించినా..ఎంతో మెచ్యురిటీతో సున్నితంగా నో చెప్పేవాడు. అయితే తాజాగా మానస్, ప్రియాంక గురించి ఓ ఇంటర్య్యూలో షాకింగ్ కామెంట్లు చేశాడు. జైలు నామినేషన్ టాస్కుల్లో అవకాశం ఉన్నా రవిని కాకుండా జెస్సీని నామినేట్ చేసింది. ఆ సందర్భం లో ప్రియాంక నటిస్తున్నట్లు అనిపించింది. అంతకుముందు టవర్ టాస్కులో కూడా చీరను అడ్డుపెట్టి ఓడిపోయేలా చేసింది. ఈ రెండు సందర్భాల్లో ప్రియాంక నటిస్తున్నట్లు ఉందని కాజల్ తో చెప్పానని మానస్ అన్నాడు. తను నా ఫ్రెండ్ కాబట్టి అన్నాను. అందరి గురించి అలా చెప్పలేనని మానస్ అన్నారు. హౌజ్ లో 90 రోజులు గడిపాక ప్రియాంక బయటకి వెళ్లింది. ఆ సమయంలో ప్రియాంక ఈ పుటేజీని చూసి నువ్వు నటించావా.. లేదా భరించావా.. అని వీకెండ్ ఎపిసోడ్లో అడిగింది. 24 గంటలు హౌస్లో నన్ను గమనించి కేవలం ఒక గంట ఫుటేజ్ చూసి అలా అడిగిందంటే అది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా’ అన్నాడు మానస్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…