Allu Arjun: ఆ విషయంలో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ.. లక్ అంటే అల్లు అర్జున్ దే..!
Allu Arjun: నిజంగా లక్ అంటే.. అల్లు అర్జున్ దే అని చెప్పాలి. ఎందుకంటే.. 2021 సంవత్సరంలో అల వైకుంఠపురం సినిమాతో మంచి విజయం సాధించాడు. అయితే ఆ సంవత్సరంలో చాలా సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.
మరి కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇలా 2021లో కలెక్షన్స్ ఎక్కువగా వసూలు చేసిన సినిమాగా అల వైకుంఠపురం నిలిచింది. తర్వాత.. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న విడుదల అయిన పుష్ప సినిమా కూడా 2022లో ఎక్కువగా కలెక్షన్స్ పొందిన సినిమాగా గుర్తింపు పొందింది.
ఇప్పటికే దీనికి ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. విడుదల అయిన రెండు వారాల తర్వాత కూడా పుష్ప సినిమాకు కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో అతడి రికార్డును అతడే చెరిపేశాడు. అల వైకుంఠపురం రికార్డును బ్రేక్ చేసింది ఈ పుష్ప సినిమా.
కరోనా మహమ్మారి పుష్ప సినిమా విడుదలకు ఏ మాత్రం అడ్డు రాలేదు. అప్పడప్పుడే కేసులు నమోదవుతున్నా.. అంతగా ఎఫెక్ట్ చూపలేదు. దీంతో పుష్ప సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. భారీ బడ్జెట్ సినిమాగా తెరెకిక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా.. సమ్మర్ లో విడుదల కావాల్సిన రాధే శ్యామ్ చిత్రానికి కరోనా థర్డ్ వేవ్ తప్పేలా లేదు. ఇక ఇవన్నీ ఆలోచిస్తే.. బన్నీకి బాగానే కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇదే విషయంలో బన్నీ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు. బన్నీ ఉంటే కరోనా ఉండదు.. కరోనా ఉంటే బన్నీ ఉండడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…