Mukku Avinash: కొత్త కారు కొనుగోలు చేసిన ముక్కు అవినాష్… అమ్మకు బాగా లేదని కొత్త కారు కొంటావా అంటూ ట్రోల్స్!

Mukku Avinash: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడమే కాకుండా వరుస బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉంటూ పెద్ద ఎత్తున అందరిని నవ్విస్తున్నటువంటి ముక్కు అవినాష్ తాజాగా లక్షల విలువ చేసే ఖరీదైన కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అవినాష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఈ క్రమంలోనే అవినాష్ మహేంద్ర ఎక్స్ యూవీ 700 కారణం కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ కారుకు పూజా కార్యక్రమాలు చేయించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను వీరు షేర్ చేశారు. ఇక అవినాష్ కొనుగోలు చేసిన ఈ కారు ఖరీదు సుమారు 25 లక్షల వరకు ఉంటుందని సమాచారం.తన పాత కారుకు యాక్సిడెంట్ కావడంతో దానిని ఎక్స్చేంజ్ చేసి ఈ కొత్త కారును కొనుగోలు చేశారని తెలిపారు.


Mukku Avinash: అమ్మకు బాగా లేదని ఏడ్చావుగా…

ఈ విధంగా అవినాష్ కారు కొనుగోలు చేశారనే విషయం తెలియడంతో ఎంతో మంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మరి కొందరు మాత్రం భారీగా ట్రోల్ చేస్తున్నారు. మొన్ననే కదా అమ్మకు బాగా లేదంటూ ఏడ్చారు.అమ్మకు స్టంట్ వేశారని తెలిపారు. ఆ వీడియో చేసి కారు కొనే అంత డబ్బు సంపాదించావా…అమ్మకు బాగాలేని సమయంలో కొత్త కారు కొనుగోలు చేయడం అవసరమా అంటూ భారీగా అవినాష్ పై ట్రోల్స్ చేస్తున్నారు.