Categories: FeaturedMovie News

Sai Dharam Tej: ఏరా తాగి వచ్చావా అంటూ మామయ్య ప్రశ్నించారు… సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్!

Sai Dharam Tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ సినిమాగా బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఈ సినిమా జులై 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ తన భుజాలపై వేసుకొని భారీ స్థాయిలో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ కు తనకు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల గురించి తెలియజేశారు. పవన్ కళ్యాణ్ మామయ్యతో కలిసి సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టం అని తెలిపారు. అయితే కొన్ని సందర్భాలలో చాలా ఇబ్బందిగా మారిందని కూడా సాయిధరమ్ తేజ్ వెల్లడించారు.

ఈ సినిమాలో కేక్ తినిపించే ఒక సన్నివేషం ఉంటుంది అయితే ఆ సమయంలో తాను చాలా ఇబ్బంది పడ్డానని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మామయ్య ముందు మందు తాగినట్టు నటించాల్సిన ఒక సన్నివేశం కూడా ఉంది అయితే ఈ సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చింది. ఈ షాట్ కంప్లీట్ అవ్వగానే మావయ్య ఏరా నిజంగానే తాగేసి వచ్చావా అంటూ నన్ను ప్రశ్నించారని సాయి ధరంతేజ్ వెల్లడించారు.

Sai Dharam Tej: మామయ్యతో నటించడానికి ఇబ్బంది పడ్డాను..

ఇలా మామయ్యతో కలిసి నటించడం ఓ గొప్ప అనుభూతి అయినప్పటికీ కొన్నిచోట్ల మాత్రం ఇబ్బంది పడ్డానని ఈ సందర్భంగా సాయితేజ్ వెల్లడించారు. మరి మామ అల్లుళ్ళ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాలో వీరిద్దరి నటన ద్వారా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తమిళ వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ చిత్రం అనే విషయం మనకు తెలిసిందే. ఈ నెల 28వ తేదీ ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలకు సిద్ధమైంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago