Analyst Damu Balaji : మణిపూర్ రాష్ట్రములో జరుగుతున్న అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకొని రెండు తెగల మధ్య వైరం ఏకంగా మహిళల మీద దాడి నగ్న ఊరేగింపు వరకు వెళ్లాయి. ఆలస్యంగా వెలుగు చుసిన ఈ ఘటన ఆ రాష్ట్రంలోనే కాదు దేశంలోని అందరిని ఆశ్చర్యపరిచింది. మణిపూర్ లో స్థానికంగా ఉన్న రెండు తెగలు మైతీలు మరియు కుకిల మధ్య జరిగిన గొడవ వందల మంది ప్రాణాలను అలాగే ఊర్లకు ఊర్లను తగులబెట్టే వరకు తీసుకెళ్ళింది. మైతీలకు ఎస్టీ హోదా ఇచ్చే అంశం పరిశీలించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హై కోర్ట్ కోరడంతో మొదలయిన ఆందోళనలో మే నుండి ఆ రాష్ట్రము అట్టుడికింది. ఇక మహిళల నగ్న ప్రదర్శన చేసారని వీడియో బయటికి రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా బాధిత మహిళ మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో లీక్ లో విస్తూ పోయే నిజాలు బయటికి వస్తున్నాయి. ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
నగ్న ప్రదర్శన.. సామూహిక అత్యాచారం…
మైతీ తెగకు సంబంధించిన కొంతమంది కుకి తెగకు సంబంధిచిన ఆడవాళ్ళను అత్యాచారం చేసారు అనే వార్తలు వ్యాపించడంతో మైతీ తెగకు చెందిన ముగ్గురు మహిళలను పట్టుకుని కుకి తెగ వారు వారిని నగ్నంగా ఊరేగించారు. అడ్డు వచ్చిన ఒక మహిళ తండ్రిని అక్కడే చంపేశారు. మరో కుర్రాడిని చంపేశారు. ఇక ఇపుడు బాధిత మహిళ మాట్లాడిన ఆడియో లీక్ లో వారిని పోలీసులే కుకిలకు అప్పగించినట్లు ఆమె చెప్పడం దిగ్బ్రాంతిని కలిగిస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు. కుకిల నుండి కాపాడమని వేడుకుంటు పోలీసుల వద్దకు వెళితే పోలీసులే కుకిలకు అప్పగించారాని ఇక గుంపులుగా వచ్చిన వారు మమ్మల్ని నగ్నంగా ఊరేగిస్తూ తాకరాని చోట తాకుతూ కొట్టి గాయపరిచారంటు బాధిత మహిళ ఆడియో లో తెలిపింది.
ఇక ఉరి చివర పొలాల వద్దకు తీసుకెళ్లి చాలా మంది అత్యాచారం చేసారని అత్యాచారం చేసిన వారిలో తెలిసిన వాళ్ళు, తన తమ్ముడి స్నేహితులు కూడా ఉన్నారంటు ఆమె తెలిపారు. ఇంకా ఎవరైనా అత్యాచారం చేస్తారా అంటూ గట్టిగ ఇతరులను అడిగారని ఆమె ఏడుస్తూ మనీపూరి భాషలో చెప్పిన మాటల ఆడియో ఇపుడు సంచలనం రేపుతోందని బాలాజీ తెలిపారు. ఇక మరో మహిళ ఒక ఆర్మీ ఉద్యోగి భార్య కాగా ఆమెను బట్టలు విప్పకపోతే చంపేస్తామని బెదిరించడం తో ఆమె పాపకోసం నగ్నంగా నిలబడగా ఆమె భర్త ఊరికి పెద్ద మనిషి కావడం వాళ్ళ ఆమెను అత్యాచారం చేయకుండా కొంతమంది కాపాడి ఆమెను అక్కడి నుండి తప్పించి ఒక నాగ కుటుంబం దగ్గర అశ్రయం ఇచ్చారు. ఇలా ఇంటర్నెట్ సేవలు పునఃవ్యవస్థికరించడంతో మణిపూర్ లో జరిగిన ఘోరాలు అన్ని ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి అంటూ బాలాజీ తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…