Murali Mohan : మందు తాగమని ఏఎన్ఆర్ సలహా ఇచ్చారు.. చలం చనిపోవడాన్ని చాలా రోజులు భరించలేక పోయా..!

Murali Mohan : తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు మురళి మోహన్ గారు. వ్యాపారం చేసుకుంటూ ఉండి సినిమాల్లోకి వచ్చిన మురళీ మోహన్ గారు, చిన్న చిన్న సినిమాలతో తన ప్రయాణం మొదలుపెట్టి, తన నటనతో అలరించారు. జయభేరి ప్రొడక్షన్ హౌస్ ద్వారా సినిమాలను కూడా తీశారు. ఇక రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి అక్కడా రాణించారు.

నాగేశ్వరావు గారు నాకు మందు అలవాటు చేసుకోమన్నారు….

సినిమాల్లోకి రావడానికి చాలా ఆలోచించానని, వ్యాపారం చేసుకునే వాడికి సినిమాల్లోకి వెళితే అక్కడ సక్సెస్ కాకపోతే పరిస్థితి ఏంటనే మీమాంసలో చాలా రోజులు ఉన్నానని ఇక సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాక సిగరెట్, మధ్యపానం, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని నిబంధన నాకు నేనే పెట్టుకుని సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. అయితే ఒక సందర్బంలో నాగేశ్వరావు గారు రాత్రికి ఏమి తాగుతావ్ అని అడిగారు, నేను తాగానని చెప్పగా 60 దాటాక శరీరంలోని నరాలు అదుపులో ఉండవని కొంచెం తాగితే మంచిదని చెప్పగా, అంత పెద్దవారు చెప్పారు కదా అని కొన్నిరోజులు తాగాను కానీ నచ్చక మానేశాను. ఎపుడైనా పార్టీలలో కొంచెం తాగుతాను అంతే అని వివరించారు. సినిమా ప్రయాణంలో రెండు విషయాలు బాగా కలచి వేశాయని చెప్పారు.

బంగారక్క సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవి హీరోయిన్ గా చేసింది. ఆ షూటింగ్ లో చిన్నపిల్లతో చేసినపుడు ఒక అమ్మాయికి సహాయంగా వచ్చిన వాళ్ళ అక్కను యూనిట్ లో మేము గమనించలేదు. చివరికి సాయంత్రం షూటింగ్ అయ్యాక వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాకబు చేయగా అప్పుడైనా ఇంకో చిన్నపిల్ల అక్కడుందని తెలిసి, వెతకగా నీళ్లలో పడి బురదలో చిక్కుకుపోయింది. ఆ సంఘటన చాలా బాధపెట్టింది.

ఇక చాలా సినిమాల్లో హీరోగా కమెడియన్ గా నటించిన చలం రైలు పట్టాలపైన శవం గా కనిపించినప్పుడు తట్టుకోలేక పోయాను. ఆరోజు నేను, మోహన్ బాబు చలం కోసం వెతికాము. చివరికి రైలు పట్టాలపై కనిపించాడు. ఇక చలం అంత్యక్రియలు దాసరి గారు చాలా బాగా చేసారు. కొన్నేళ్లు ఆయన మరణం గుర్తుకువచ్చేది అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.