Sai Pallavi : మలయాళం సినిమాతో మొదలై ప్రస్తుతం దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా ఉన్న సాయి పల్లవి, తన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక తన నటన, డాన్సులే కాదు తన వ్యక్తిత్వంతో కూడా ఆకట్టుకుంది. కేవలం తనకు నచ్చినట్టు పాత్రల్నే చేస్తూ ఈ తరంలో ఏ మాత్రం గ్లామర్ షో చేయకుండా చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ రౌడీ బేబీ.
అందుకే చిరంజీవి గారితో సినిమా చేయలేదు…..
ఇక తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సాయి పల్లవిని ఇంటర్వ్యూ చేసారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ లో ఆమెతో మాట్లాడారు. ఈ సందర్బంగా చిరంజీవి సాయి పల్లవి భోళా శంకర్ సినిమాలో చేసుంటే బాగుండేదని అనడం గురించి మాట్లాడారు. అయితే సాయి పల్లవి ఈ ప్రశ్నకు వివరణ ఇచ్చింది. రీమేకులంటే నాకు భయం అని ఆల్రెడీ ఆ సినిమా తమిళ లో అజిత్, లక్ష్మి మీనన్ చేసారని, ఆ సినిమా నేను చూసానని అందుకే తెలుగులో చేయాలంటే భయమేసిందని చెప్పారు. రీమేక్ సినిమాలో ఒరిజినల్ సినిమా నటి నటుల నటనతో రీమేక్ ను పోల్చి చూస్తారు అందుకే నాకు భయమని అంతే తప్ప చిరంజీవి గారిని నొప్పించాలని కాదని ఆయన నేను చేసుంటే బాగుండు అన్నపుడు బాధ కలిగిందని చెప్పింది. ఇక డాన్స్ తో ఆయనతో పోటీ పడతావా అన్నపుడు ఆయన గ్రేస్ ఇంకెవరికీ రాదని, చాలాసార్లు ముఠా మేస్త్రి లోని పాటకు డాన్స్ ప్రయత్నించినా ఆయనలాగా చేయలేక పోయానని చెప్పింది.
ఇక చిరంజీవి గారి పక్కన డాన్స్ చేసే అవకాశమే వస్తే అది ఒక గౌరవంగా భావిస్తానని సాయి పల్లవి తన అభిప్రాయాలను తెలిపింది. తన చెల్లిని చూస్తే చాలా గర్వంగా ఉంటుందని తాను సమాజానికి సేవ చేయడం కోసం సోషల్ వర్క్ ను ఎంచుకుందని అందులో మాస్టర్స్ చేసిందని వెల్లడించింది. ఇక లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు అడిగారని తన కజిన్స్ అందరికీ పెళ్లిళ్లు అవ్వడం వల్ల అలా అడిగారని కానీ తనకు ఇంకా పెళ్ళికి సమయం కావాలని చెప్పిందట సాయి పల్లవి.
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…