Murali Mohan: ‘మా’ బిల్డింగ్ కట్టాలనుకున్నాం కానీ కుదరలేదు.. సొంత డబ్బులతో విష్ణు కడతా అన్నాడుగా కడతాడో లేదో చూద్దాం : మురళి మోహన్

Murali Mohan: మురళీమోహన్ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.ఇలా ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగిన మురళీమోహన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు.

Murali Mohan: మా ప్రెసిడెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మురళీమోహన్.. మా బిల్డింగ్ కొడతాడో లేదో చూద్దాం!

ఈ క్రమంలోనే మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంది అవార్డుల గురించి ప్రస్తావించారు. నంది అవార్డుల విషయంలోఇప్పటికీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయంలేదని ఇది పూర్తిగా కమిటీ మెంబర్స్ సూచించిన విధంగా అవార్డులను ప్రకటిస్తారని మురళీమోహన్ వెల్లడించారు.

Murali Mohan: మా ప్రెసిడెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మురళీమోహన్.. మా బిల్డింగ్ కొడతాడో లేదో చూద్దాం!

అదేవిధంగా మురళీమోహన్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తాను అయ్యప్ప మాల దీక్ష తీసుకోవడం గురించి వెల్లడించారు.ఇప్పటివరకు తాను ముప్పై మూడు సార్లు అయ్యప్ప మాల దీక్ష తీసుకున్నానని ఇంకా మూడుసార్లు తీసుకోవాల్సి ఉందని ఆయన వెల్లడించారు. తనకు చిన్నప్పటి నుంచిఎక్కువ భక్తి ఉండటం వల్ల ప్రతి రోజు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా పూజ చేసుకునే వెళ్తానని ఈ సందర్భంగా మురళీ మోహన్ తెలిపారు.

మా అసోసియేషన్ అప్పుడు జీరో…

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మా బిల్డింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు. మేము మా అసోసియేషన్ స్థాపించినప్పుడు జీరో. “మా” నుంచి మేము వైదొలగినప్పటికి మూడు కోట్ల రూపాయల మూలధనం సేకరించి పెట్టామని, మా తర్వాత వచ్చిన వారు కూడా కొంత డబ్బు సమకూర్చారని ఈ సందర్భంగా మురళీమోహన్ తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఉన్న మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గురించి కూడా మురళీమోహన్ మాట్లాడారు. మేము మా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో మా బిల్డింగ్ కట్టాలని చాలా ప్రయత్నాలు చేశాము. కానీ కుదరలేదు అయితే ప్రస్తుతం ఉన్న మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఎన్నికల సమయంలోనే మా బిల్డింగ్ కట్టిస్తానని మాట ఇచ్చారు. అది కూడా తన సొంత డబ్బులతో కడతాం అని మాట ఇచ్చారు. చాలా సంతోషం అంటూ మురళీమోహన్ మా ప్రెసిడెంట్, మా బిల్డింగ్ గురించి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావించారు.