Featured

Extra Jabardasth: తనపై వేసిన పంచ్ కి నవ్వినందుకు పూర్ణ, ఇంద్రజలపై సీరియస్ అయిన ఇమ్మాన్యుయేల్…

Extra Jabardasth: తెలుగు బుల్లితెర మీద ప్రసారమవుతున్న ప్రోగ్రాం లలో టాప్ రేటెడ్ ప్రోగ్రాం లో ఒకటిగా ఉంది ఎక్స్ట్రా జబర్దస్త్. రోజా, సింగర్ మనో ఈ ప్రోగ్రాం కి న్యాయనిర్ణేతలుగా ఉండేవారు. అయితే ప్రస్తుతం రోజా మంత్రి పదవి చేపట్టిన తర్వాత సినిమాలకు బుల్లితెర ప్రోగ్రామ్ లకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పూర్ణ ఇంద్రజ ఎక్స్ ట్రా జబర్దస్త్ కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇంద్రజ ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ లకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం లో కూడా చేస్తున్నారు. అయితే పూర్ణ మొదటి సారి జబర్దస్త్ వేదికమీద కనిపిస్తోంది. కాకపోతే ఇంద్రజ పూర్ణ ల కాంబినేషన్ ఎలా క్లిక్ అవుతుందో చూడాలి. అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం కి సంబంధించిన వచ్చేవారం ఎపిసోడ్ ప్రోమో ఒక్కటి ఆసక్తికరంగా ఉంది.

జడ్జి ల మీద సీరియస్ అయిన ఇమ్మాన్యుయేల్….

తాజాగా విడుదలైన ప్రోమో ఫుల్ పంచులతో అభిమానులను ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్ ఎప్పటిలాగే ఫన్ క్రియేట్ చేసింది. దీంతోపాటు బుల్లెట్ భాస్కర్ ఇమ్మాన్యుయేల్ స్కిట్ కూడా పంచులతో ఆకట్టుకుంది. అయితే గతం లో బుల్లెట్ భాస్కర్- ఇమ్మాన్యుయేల్ స్కిట్లో వర్ష మీద అబ్బాయిలా వున్నాయ్ అంటూ చాలా సార్లు పంచులు వేయడం జరిగింది. అయితే అందుకు వర్ష చాలా ఫీల్ అయ్యింది, ఇంకోసారి ఇలాంటి పంచులు రిపీట్ కాకూడదు అని జడ్జి లు అన్న సందర్భాలు వున్నాయ్.

అయితే తాజా ప్రమోలో ఇమ్మాన్యుయేల్, ఫైమా జోడిగా సాగుతున్న స్కిట్లో ఫైమా, ఇమ్మాన్యుయేల్ ని అమ్మాయి తో పోల్చి పంచులు వేయడం తో అక్కడ జడ్జి లుగా వున్న పూర్ణ, ఇంద్రజ లు పగలబడి నవ్వారు. అందుకు ఇమ్మాన్యుయేల్… “ఏవండీ! అమ్మాయిని పట్టుకొని అబ్బాయి అనకూడదు అన్నారు. మరి అబ్బాయిని పట్టుకొని అమ్మాయంటే ఎలా నవ్వుతారండీ?” .. అని గట్టిగ అడిగాడు. దీంతో న్యాయనిరనేతలుగా వున్న పూర్ణ, ఇంద్రజలు టక్కున సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో కి చెందిన వీడియో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago