KGF: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ నటించిన కేజీఫ్2 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన కేజీఫ్2 రికార్డులను సృష్టించింది. 1167 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేజీఫ్2 ఇంతలా రికార్డులను క్రియేట్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించిన హోంబలే సంస్థ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ కన్నడ సినీ అభిమానుల లో దుమారం రేపుతోంది.
యష్ ఒక దొంగ….
హోంబలే ఫిలిమ్స్ సంస్థ చేసిన ట్వీట్ లో హీరో యష్ ను బాక్సాఫీస్ సుల్తాన్ గా పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలో హీరో దర్శన్ బాక్సాఫీస్ సుల్తాన్ గా వెలుగుతున్నారు.హీరో దర్శన్ కన్నడలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఈయన సినిమాలు కన్నడ పరిశ్రమల లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్థాయి . ఈ నేపథ్యంలోనే హీరో దర్శన్ ను 2014 నుండి బాక్సాఫీస్ సుల్తాన్ అనే టైటిల్ తో అభిమానులు పిలుస్తారు. అయితే ఇప్పుడు తాజాగా హీరో యష్ ను బాక్సాఫీస్ సుల్తాన్ గా వర్ణించడం తో ఫాన్స్ లో వార్ మొదలైంది. ఇక హీరో దర్శన్ అభిమానులు అయితే ట్విట్టర్ వేదికగా బాక్సాఫీస్ సుల్తాన్ అనే టైటిల్ కోసం చిన్నపాటి యుద్ధం చేస్తున్నారు. అంతే కాదు ఈ యుద్ధంలో దర్శన్ అభిమానులకు మిగతా హీరోల అభిమానులు కూడా మద్దతు ఇస్తున్నారు.
ఒక్క సినిమా హిట్టు తోనే ఈ టైటిల్ ను యష్ కు ఎలా ఇస్తారు అని దర్శన్ అభిమానుల వాదన. బాక్సాఫీస్ సుల్తాన్ ఎప్పటికి తమ హీరో నే అని వారి వాదన. అంతే కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి తమ హీరో టైటిల్ ని యష్ దొంగలించారు అంటూ.. యష్ ఒక దొంగ అని తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా #TitleStealingStarYash అని ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. యష్ అభిమానులు కూడా దీనికి తగ్గట్టు ధీటుగానే స్పందిస్తున్నారు. తమ అభిమాన నటుడి పై బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఊరుకోము అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…