Featured

Mahesh Babu: తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో స్మార్ట్ గా చెప్పేసిన మహేష్ బాబు…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించి, పరశురాం దర్శకత్వం వహించిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ 14రీల్స్, జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. రెండేళ్ల తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద అభిమానులు అంచనాలు బాగా ఉన్నాయి. మే 12 న ఈరోజు సినిమా విడుదల ఉండటంతో మహేష్ బాబు నిన్న తన ఇన్‌ స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా నవ్వుతూ సమాధానాలు చెప్పారు.

మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు…..

అభిమానులు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఆసక్తికర ప్రశ్నలు మహేష్ ని అడిగారు. మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు? అని ఒక ఫ్యాన్ మహేద ని అడిగగా… తన భార్య అయిన నమ్రత శిరోద్కర్ పేరు చెప్పారు. నమ్రతలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటని వేరొక అభిమాని ప్రశ్న అడుగగా… ఆమెలో అన్నీ ఇష్టమే, అందుకే పెళ్లి చేసుకున్నాను అని మహేష్ బాబు నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

అయితే సర్కారు వారి పాట సినిమాలో పెన్ని పాట లో సితార డాన్స్ చేసిన సంగతి తెలిసిందే ఇందుకు ఒక అభిమాని, సితార భవిష్యత్తులో వెండితెరమీద నటించే అవకాశం ఉందా అని అడగగా… అందుకు మహేష్, సితార ఇప్పటికే యాక్టర్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను అని సమాధానమిచ్చారు. వెంటనే ఇంకొక అభిమాని మీ ఇంట్లో స్మార్ట్ ఎవరు అని అడగగా.. తడుముకోకుండా వెంటనే మహేష్ బాబు సితార పేరు చెప్పేశారు. ఇంత బిజీ షెడ్యూల్లో పిల్లలతో సమయం ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించిన ఒక అభిమానికి… అది నేను చెప్పలేను కానీ పిల్లలతో మాత్రం తప్పకుండా సమయాన్ని గడపడానికె ఇష్టపడతాను అని సమాధానం చెప్పాడు.  ఈ విధంగా మహేష్ బాబు అభిమానుల తో చేసిన చిట్ చాట్ ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago