General News

సీఎస్‌కేకు మరో షాక్.. ఖలీల్ అహ్మద్ టోర్నీ నుంచి ఔట్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.

ఇటీవల కోల్‌కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ ఖలీల్ గాయపడాడు. తన ఓవర్ మధ్యలోనే నొప్పితో బాధపడుతూ మైదానం వీడాల్సి వచ్చింది. మొదట చిన్న సమస్యగా భావించినా, పరీక్షల్లో కుడి తొడ కండరాల్లో తీవ్ర గాయం ఉన్నట్లు తేలింది. ఈ గాయం కారణంగా అతడు సీజన్ మొత్తానికి దూరమవ్వాల్సి వచ్చింది.

ఖలీల్ గాయం సీఎస్‌కేకు పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటికే జట్టు సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ గాయం కారణంగా అందుబాటులో లేడు. అలాగే విదేశీ పేసర్ స్పెన్సర్ జాన్సన్ కూడా వెన్నునొప్పితో జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఖలీల్ ఔట్ కావడం బౌలింగ్ విభాగాన్ని మరింత బలహీనపరిచింది.

జట్టు మేనేజ్‌మెంట్ ప్రస్తుతం ఖలీల్ స్థానంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ముఖేశ్ చౌదరి, రామకృష్ణ ఘోష్ వంటి బౌలర్లు జట్టులో అవకాశాలు పొందే అవకాశముంది.

ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టు ఐదు మ్యాచ్‌లలో రెండు విజయాలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్ సీఎస్‌కేకు కీలకంగా మారింది. వరుస గాయాల మధ్య జట్టు ఎలా పుంజుకుంటుందో చూడాల్సి ఉంది.

Sairam K

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago