Music Director Koti : నా డైట్ సీక్రెట్ ఇదే… రాజ్ చనిపోయినపుడు నా పరిస్థితి… నా భార్య నావల్ల చాలా కష్టపడింది….: మ్యూజిక్ డైరెక్టర్ కోటి

Music Director Koti : సాలూరి రాజేశ్వర్రావు గారి తనయుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తండ్రి లాగానే సంగీతదర్శకుడిగా మారిన సాలూరి కోటేశ్వరరావు అలియాస్ కోటి గారి సంగీతం గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. కోటి మొదట రాజ్ తో కలిసి రాజ్ కోటి కాంబినేషన్ లో చాలా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఇక ఆ తరువాత ఇద్దరు పలు కారణాలతో వీడిపోయి ఎవరికీ వారు సొంతంగా మ్యూజిక్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ సమయంలో కూడా హిట్లర్, హలో బ్రదర్, బంగారు బుల్లోడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి కోటి గారికి. చిరంజీవి కాంబినేషన్ లో దాదాపు 11 సినిమాలు చేసి హిట్లు కొట్టారు కోటి. ఇక కెరీర్ లో ఒడదుడుకులను ఇంటర్వ్యూ లో పంచుకున్నారు కోటి.

రాజ్ చనిపోయినపుడు ఎలా అయిపోయానంటే….

మ్యూజిక్ డైరెక్టర్ కోటి అనగానే రాజ్ కోటి అనే గుర్తొస్తుంది. వీరిద్దరి ధ్వయం ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. వారిద్దరి స్నేహం గురించి కోటి మాట్లాడుతూ ఇద్దరు చక్రవర్తి గారి వద్ద పనిచేస్తున్న సమయంలోనే రాజ్ కి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం వస్తే ఇద్దరం కలిసి చేద్దామా అని పిలిచారట. అయితే మొదట చక్రవర్తి గారు వద్దని చెప్పిన స్నేహం కోసం కోటి గారు చేశారట. అలా రాజ్ కోటి గా మారి ఇద్దరు ఎన్నో సూపర్ హిట్స్ ఇవ్వగా పదేళ్ల తరువాత రాజ్ మళ్ళీ ఇద్దరం విడిపోయి ఎవరి మ్యూజిక్ వాళ్ళు చేసుకుందాం అని చెప్పి విడిపోయాడు. రమ్మన్నది వాడే విడిపోదామని చెప్పింది వాడే అంటూ కోటి చెప్పారు. ఇక రాజ్ గారు మరణించడానికి ఇరవై రోజుల ముందు కూడా ఇద్దరం కలిసి చాలా సేపు మాట్లాడుకున్నాం అంటూ ఒక్కసారిగా మరణ వార్త వినగానే చేతులు కాళ్ళు ఆడలేదు అంటూ కోటి తెలిపారు. రాజ్ చనిపోయాడని విన్నప్పుడు ఒక్కసారిగా ఆగిపోయాను ఎం చేయాలో ఎం ఆలోచించాలో కూడ తెలియలేదు. మేమిద్దరం విడిపోయి మ్యూజిక్ చేసుకున్న స్నేహితులుగా కలిసే ఉన్నాం.

నేను ఒక్కడినే మ్యూజిక్ చేసినపుడు కూడ రాజ్ ఉన్నాడు నాతో అనే చేసేవాడిని అంటూ కోటి రాజ్ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను రాజ్ కలిసి పనిచేసినపుడు రికార్డింగ్ స్టూడియో తప్ప వేరే లోకం ఉండేది కాదు పని చేస్తూ సమయానికి తినకుండా బాగా లావుగా ఉండేవాళ్ళం. కానీ కాలం గడిచాక మైంటైన్ చేయాలనీ అర్థమైంది అందుకే ఆరోగ్యం విషయం లో జాగ్రత్తగా ఉంటాను అంటూ డైట్ కంటే ముఖ్యం ప్రశాంతంగా ఉండటం అలానే ఎక్కువగా దేని గురించి ఆలోచించకుండా ఉండటం ఇవి రెండు నేర్చుకున్నాక నేను ఇలా ఉన్నాను అంటూ చెప్పారు. ఇక భార్య గురించి మాట్లాడుతూ ఆమె లేకపోతే నేను నా కెరీర్ ఇలా ఉండదు. తాను నన్ను తన బిడ్డ లాగే చూసుకుంది. బాధ్యతలాన్ని తానే తీసుకుంది నన్ను, పిల్లల్ని తీసుకెళ్లి నట్లు షాపింగ్ తీసుకెళ్తుంది. నేను టెన్షన్ లో ఉన్న తానే నా మూడ్ మార్చేస్తుంది అంటూ నా వల్ల నా భార్య బాగా ఇబ్బంది పడింది అంటూ చెప్పారు కోటి.