Heroine Sreeleela : శ్రీకాంత్ తనయుడి సినిమా పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ శ్రీలీల. ఆమె పుట్టి పెరిగింది బెంగళూరు అయినా ఆమె తల్లిదండ్రులది ఏపీ కావడం విశేషం. ఇక ఎంబిబిఎస్ చదువుతూనే సినిమాల వైపు చుసిన ఈ బ్యూటీ అటు కన్నడ, ఇటు తెలుగులో దూసుకుపోతోంది. ఓవైపు మంచి లుక్స్ మరోవైపు నటన ఇక హీరోలతో సమానంగా డాన్స్ ఇవన్నీ శ్రీ లీల కు ప్లస్ పాయింట్స్. దీంతో ఇపుడు పెద్ద హీరోల సినిమాలు కూడ క్యూ కడుతున్నాయి. తాజాగా అమ్మడి ఖాతాలో క్రేజి ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయ్.
పండగలన్నింటిని కవర్ చేసిన బ్యూటీ…
పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా మాస్ రాజా రవితేజ ధమాకా సినిమాలో ఛాన్స్ కొట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో అమ్మడికి అవకాశలు క్యూ కట్టేసాయి. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వస్తున్న బోయపాటి సినిమా స్కంద తో వినాయక చవితికి సందడి చేయనుంది ముద్దుగుమ్మ.
ఇక అక్టోబర్ లో బాలకృష్ణ భగవంత్ కేసరి లో ఆయన కూతురిగా కనిపించునుంది. దసరా కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలోని ఈ సినిమా రానుంది. ఇక దీపావళి కి సాయి ధరమ్ తేజ్ అది కేశవ సినిమాతో రానుంది. ఇక డిసెంబర్ లో క్రిస్మస్ కు నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్ లో వస్తున్న ఎక్సట్రాఆర్డినరి సినిమాలో కనిపిస్తోంది. ఇక సంక్రాంతికి ఏకంగా సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా ద్వారా ఆ పండగను కవర్ చేసేసింది శ్రీలీల. మొదట పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్న ఆమె తప్పుకోవడంతో శ్రీ లీల మెయిన్ లీడ్ గా మీనాక్షి చౌదరిని సెకండ్ లీడ్ గా తీసుకున్నారు. ఇలా అమ్మడు మొత్తం పండగలను కవర్ చేసేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…