Music director Koti : బాలకృష్ణ సినిమాకు చాలా నష్టపోయాను… అరుంధతి లాంటి పెద్ద హిట్ ఇచ్చినా అవకాశాలు రాలేదు : కోటి

Music director Koti : సాలూరి రాజేశ్వర్రావు గారి తనయుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తండ్రి లాగానే సంగీత దర్శకుడిగా మారిన సాలూరి కోటేశ్వరరావు అలియాస్ కోటి గారి సంగీతం గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. కోటి మొదట రాజ్ తో కలిసి రాజ్ కోటి కాంబినేషన్ లో చాలా సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఇక ఆ తరువాత ఇద్దరూ పలు కారణాలతో వీడిపోయి ఎవరికి వారు సొంతంగా మ్యూజిక్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ సమయంలో కూడా హిట్లర్, హలో బ్రదర్, బంగారు బుల్లోడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి కోటి గారికి. చిరంజీవి కాంబినేషన్ లో దాదాపు 11 సినిమాలు చేసి హిట్ కొట్టిన కోటి గారికి చిన్న చిన్న మనస్పర్తల కారణంగా చిరంజీవి గారికి దూరం అయ్యారు. ఇక కెరీర్ లో ఒడిదుడుకులను ఇంటర్వ్యూ లో పంచుకున్నారు కోటి.

బాలకృష్ణ తో సినిమా వల్ల బాగా నష్టపోయాను…

మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయమంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ వైపు వెళ్లాలని అనిపించి బాలకృష్ణ సినిమా కోదండ రామి రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమాకు నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. అప్పట్లోనే ఎనిది లక్షలకు డిస్ట్రిబ్యూషన్ కొన్నాను. సంగీత దర్శకౌడిని సినిమాకు నేనే కావడంతో సినిమా మంగమ్మ గారి మనవడు సినిమా రేంజ్ లో ఉంది అని అంత హిట్ అవుతుందని భావించి చాలా నమ్మకం పెట్టుకుంటే సినిమా డిజాస్టర్ అయింది. దీంతో మొత్తం పెట్టిన డబ్బులు పోయాయి. ఇక మళ్ళీ ఇంకో వ్యాపారం మొదలు పెట్టినా అప్పుడు కూడా అలానే జరిగింది. దేవుడు నీకు మ్యూజిక్ చేసుకో అది మత్రమే వచ్చు ఇంకేమిట్లోను వేలు పెట్టకు అన్నట్టుగా అనిపించింది. దెబ్బకు ఇంక ఏ వ్యాపారం జోలికి వెళ్ళలేదు అని కోటి చెప్పారు.

ఇక అరుంధతి సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. సినిమా లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినా కోటి కి అవకాశలు రాలేదట. ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ వచ్చిందని, ఎందుకు అవకాశాలు రాలేదో తెలియలేదని చెప్పారు. రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయలేదు, అందరితోనూ టచ్ ఉన్నా కూడా ఎందుకో అవకాశాలు రాలేదు. ఇప్పటికి అది ఒక అంతుచిక్కని ప్రశ్న. బహుశా అది లేడీ ఓరియెంటెడ్ సినిమా అవ్వడం వల్ల అలా జరుగుండొచ్చని అనుకున్నా అంటూ కోటి చెప్పారు. కానీ ఏ రోజూ నిరాశ చెందలేదని నా కెరీర్ లో చేసిన పాటలన్నీ ప్రేక్షకులకు నచ్చాయని అభిప్రాయ పడ్డారు.