IFFI: ఆ చెత్త సినిమాను ఎలా ప్రదర్శించారు.. ఫిలిం ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో జ్యూరీ హెడ్ షాకింగ్ కామెంట్స్!

IFFI: ప్రతిరోజు ఎన్నో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలను మాత్రమే ఎంపిక చేసి వాటిని ప్రపంచవ్యాప్తంగా పలు ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రదర్శితం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని గోవాలో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలో ఈ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా 15 చిత్రాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ భాషలలో సెలబ్రిటీలు ఇక్కడికి హాజరయ్యి సందడి చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమం కోసం 15 సినిమాలను ఎంపిక చేయగా ఇందులో 14 సినిమాలు మాత్రమే బాగున్నాయని ఒక సినిమా మాత్రం చౌకబారు సినిమా అంటూ ఈ ఫిలిం ఫెస్టివల్ హెడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

53వ ఇంటర్నేషనల్ ఫీలిమ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా కార్యక్రమం సోమవారం ఎంతో ఘనంగా ముగిసాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమ హెడ్ నదవ్ లపిడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన 14 సినిమాలు చాలా బాగున్నాయి. అయితే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా మాత్రం చాలా చౌకబారు సినిమా అని, ఈ సినిమా చూసి తాము షాక్ అయ్యామని ఇలాంటి ఒక చెత్త సినిమాని IFFI లో ఎలా ప్రదర్శించారని ఈయన మండిపడ్డారు.

IFFI: చౌకబారు సినిమాలను ప్రదర్శించడం మంచిది కాదు…

కళాత్మకమైన చిత్రాలను ప్రదర్శించబడే ఈ వేదికపై ఇలాంటి చిత్రాలను ప్రదర్శించడం మంచిది కాదని ఈయన పేర్కొన్నారు.లపిడ్ ఇజ్రాయెల్ కు చెందిన ఫిల్మ్ డైరెక్టర్. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకోవడమే కాకుండా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి కూడా ఈయన జూరీ హెడ్ గా నిలిచారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.