IFFI: ప్రతిరోజు ఎన్నో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలను మాత్రమే ఎంపిక చేసి వాటిని ప్రపంచవ్యాప్తంగా పలు ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రదర్శితం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని గోవాలో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలో ఈ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా 15 చిత్రాలను ఎంపిక చేసి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ భాషలలో సెలబ్రిటీలు ఇక్కడికి హాజరయ్యి సందడి చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమం కోసం 15 సినిమాలను ఎంపిక చేయగా ఇందులో 14 సినిమాలు మాత్రమే బాగున్నాయని ఒక సినిమా మాత్రం చౌకబారు సినిమా అంటూ ఈ ఫిలిం ఫెస్టివల్ హెడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
53వ ఇంటర్నేషనల్ ఫీలిమ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా కార్యక్రమం సోమవారం ఎంతో ఘనంగా ముగిసాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమ హెడ్ నదవ్ లపిడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన 14 సినిమాలు చాలా బాగున్నాయి. అయితే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా మాత్రం చాలా చౌకబారు సినిమా అని, ఈ సినిమా చూసి తాము షాక్ అయ్యామని ఇలాంటి ఒక చెత్త సినిమాని IFFI లో ఎలా ప్రదర్శించారని ఈయన మండిపడ్డారు.
కళాత్మకమైన చిత్రాలను ప్రదర్శించబడే ఈ వేదికపై ఇలాంటి చిత్రాలను ప్రదర్శించడం మంచిది కాదని ఈయన పేర్కొన్నారు.లపిడ్ ఇజ్రాయెల్ కు చెందిన ఫిల్మ్ డైరెక్టర్. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను అందుకోవడమే కాకుండా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి కూడా ఈయన జూరీ హెడ్ గా నిలిచారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…