Featured

GV Narayana Rao : చిరంజీవి కోసం కృష్ణం రాజు గారి సినిమా ఆపాను… కోదండ రామిరెడ్డి ని తీసుకువచ్చి చిరంజీవికి హిట్ ఇచ్చాను : జీవి నారాయణ రావు

GV Narayana Rao : ‘అంతులేని కథ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు జీవీ నారాయణ రావు గారు. ఆ సినిమా తరువాత హీరోగానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ప్రొడ్యూసర్ గా మారి చిరంజీవి గారితో దేవాంతకుడు, అలాగే ఫ్రెండ్స్ తో కలిసి యముడికి మొగుడు సినిమాలను తీసి మంచి హిట్స్ అందుకున్నారు. నటుడుగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గానూ అలాగే రైటర్ గానూ పలు సినిమాలకు పని చేసారు నారాయణ రావు గారు. చిరంజీవి తో ఉన్న స్నేహం కారణంగా ఆయన చాలా సినిమాలకు స్క్రిప్ట్ అందించారు. అలాంటి ఒక సినిమా ‘పసివాడి ప్రాణం’. అయితే ఆ సినిమా అప్పుడు జరిగిన విషయాలను నారాయణ రావు గారు పంచుకున్నారు.

కృష్ణం రాజు గారి సినిమా ఆపాను…

మలయాళం సినిమా కథ నచ్చి డైరెక్టర్ ఫాజిల్ వద్దకు వెళ్లి రీమేక్ రైట్స్ కొన్నారట నారాయణ రావు గారు. అయితే ఆ సినిమా డబ్బింగ్ రైట్స్ కొని కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్ లో కృష్ణం రాజు గారి సినిమా తీయాలనీ మూహూర్తం షాట్ కూడా చేశారు హరిప్రసాద్. ఆ సినిమాకు నిర్మాత హరిప్రసాద్, నారాయణ రావు, చిరంజీవి వీళ్లందరూ మంచి స్నేహితులు. అయితే నారాయణరావు గారికి విషయంలో తెలిసి అరవింద్ గారికి ఫోన్ చేసి ఎలా వదిలేద్దామా అన్నా కూడా నారాయణరావు ఒప్పుకోకుండా మనం తీద్దాం, చిరంజీవి కి నాప్పేలాగా కథ రెడీ చేద్దాం అని చెప్పి సినిమాలో బాబు పాత్ర చేసిన సుజిత ను అడ్వాన్స్ ఇచ్చి సినిమాకు తీసుకుని సత్యానంద్ గారితో కూర్చొని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు.

అంతా అయ్యాక చిరంజీవి సినిమా తీద్దామా వద్దా అన్నపుడు స్క్రిప్ట్ అంతా చెప్పి వర్క్ అవుట్ అవుతుంది అని చెబితే కోదండ రామి రెడ్డితో నేను మాట్లాడతాను అని చిరంజీవి మాట్లాడారట. ఆయన చేస్తా అనగా ఇక కృష్ణం రాజు గారి సినిమాకు నిర్మాతగా ఉన్న వ్యక్తి నారాయణ రావు స్నేహితుడు అవ్వడం వల్ల ఆయన సినిమా ఆపేసి వచ్చేసారు. అలా ఆ సినిమా కోసం కృష్ణం రాజు గారి సినిమాను ఆపేసారు నారాయణరావు. అయితే ఆ సినిమా చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచి ఆ తరువాత మంచి సినిమాలకు నాంది పలికింది అంటూ నారాయణ రావు గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago