Samantha: కొత్త స్నేహితులతో తరచూ పార్టీలు చేసుకుంటూ రచ్చ చేస్తున్న సమంత... ఫోటో వైరల్!

Naga Chaitanya -Samantha: సమంత నాగచైతన్య విడాకులకు కారణం ఆ హీరో నేనా.. అతడి ఒత్తిడితోనే చైతు విడాకులు ఇచ్చారా?

Naga Chaitanya -Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ నాగచైతన్య సమంత జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేవారు. ఇలా ఈ జంట ఎందరికో ఆదర్శంగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఉన్నఫలంగా వీరిద్దరూ మధ్య కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.

ఈ విధంగా సమంత నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అని ఎంతోమంది ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు. అయితే సమంత నాగచైతన్య మధ్య వ్యక్తిగత విషయాల కారణంగా వీరిద్దరు విడాకులు తీసుకున్నామని వెల్లడించారు. ఇకపోతే సమంతకు నాగచైతన్య విడాకులు ఇవ్వడానికి ఒక హీరో ప్రేమేయం చాలా ఉందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రభావం నాగచైతన్య పై అధికంగా ఉందని ఆయన ఒత్తిడి కారణంగానే సమంతకు నాగచైతన్య విడాకులు ఇచ్చారని ప్రముఖ ఫిలిమ్ క్రిటిక్ కె ఆర్ కె ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా కేఆర్కే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నా దగ్గర పూర్తి సమాచారం ఉంది నాగచైతన్య సమంతకు విడాకులు ఇవ్వడానికి అమీర్ ఖాన్ నాగచైతన్యను ఎలా ఒప్పించాడు అనే సమాచారం ఉందని త్వరలోనే ఈ విషయాలను బయట పెడతాను అంటూ ఈయన చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరోసారి వార్తల్లో నిలిచిన సమంత నాగచైతన్య విడాకుల విషయం…

నిజంగానే సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం అతనేనా.. అని నెటిజన్లు పెద్ద ఎత్తున సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో నాగచైతన్య సమంత ఇద్దరు విడాకులు తీసుకున్న తర్వాత వీరి విడాకుల విషయంపై కంగనా స్పందిస్తూ అమీర్ ఖాన్ తో కలిసి నాగచైతన్య సినిమా చేయడంతో ఆయన మాదిరిగానే తన భార్యకు విడాకులు ఇచ్చారు అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కె ఆర్ కె చేసిన ట్వీట్ వల్ల కంగనా చేసిన వ్యాఖ్యలు నిజమేనని పలువురు భావిస్తున్నారు.