Nithya Menon: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు హీరోయిన్లకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే ఇలా వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే వాస్తవమైనప్పటికీ చాలా మటుకు అవాస్తవాలు అయి ఉంటాయి. అయితే ఇలాంటి గాసిప్స్ రావడం సర్వసాధారణం.
ఈ క్రమంలోనే నటి నిత్యమీనన్ పెళ్లి గురించి ఈ విధమైనటువంటి వార్తలు చక్కర్లు కొట్టాయి.నిత్యామీనన్ మలయాళీ హీరోని పెళ్లి చేసుకోబోతుందని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈమె నా ప్రమేయం లేకుండానే నా పెళ్లి చేసేస్తారా అంటూ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా మరొక వీడియో ద్వారా ఈమె పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు.
నా ప్రమేయం లేకుండానే నా పెళ్లి గురించి ఒక సంతోషకరమైన కథ అల్లారు. అంటూ చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ప్రస్తుతం తనకు వరుస సినిమాలు రావడంతో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని నిత్యమీనన్ ఈ సందర్భంగా మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఐదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని,తన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో తాను ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నానని చెప్పారు.
ఇలా తాను కమిట్ అయిన సినిమా షూటింగ్ లు అన్నీ పూర్తి అయిన తర్వాత తాను వెకేషన్ ప్లాన్ చేస్తున్నానని ఈ వీడియో ద్వారా నిత్యమీనన్ వెల్లడించారు. ఇలా నిత్యమీన తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ తాను పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న నిత్యమీనన్ ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…