Featured

Amma Rajashekhar : నేను స్టోరీ చెబితే.. హీరో గోపీచంద్ అలా మోసం చేసాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అమ్మ రాజశేఖర్ !

Amma Rajashekhar : నటులు డైరెక్టర్లు గా మారడం, డైరెక్టర్లు సినిమాల్లో నటించడం ఇవన్నీ మామూలే. ఇక డాన్స్ మాస్టర్లు డైరెక్షన్లోకి రావడం కూడా చూసాము. ప్రభూ దేవా, రాఘవ లారెన్స్ అలా డాన్స్ మాస్టర్లుగా ఉంటూ దర్శకులుగా మారిన వాళ్ళే. ఇక ఆకోవలోకి వస్తాడు అమ్మ రాజశేఖర్. డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు ఉన్న అమ్మ రాజశేఖర్ డైరెక్టర్ గా మారాడు. తమిళంలో సినిమా ప్రయత్నాలు చేసి ఇక తెలుగులోనూ సక్సెస్ అయ్యాడు అమ్మ రాజశేఖర్.

గోపీచంద్ అలా చేస్తాడని అనుకోలేదు…

తెలుగులో గోపీచంద్ హీరోగా ‘రణం’ సినిమాను దర్శకత్వం వహించారు అమ్మ రాజశేఖర్. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇక ఆ తరువాత రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో ఖతర్నాక్ సినిమా తీశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నీ తానై ఎడిటింగ్ చేసాడు నా ప్రమేయం లేకుండా, ఇక కో ఆర్డినేటర్ నన్ను మోసం చేసారు అంటూ ఆరోపించాడు. సినిమా ఎడిటింగ్ సరిగా చేయకుండా ట్రిమ్ సరిగా చేయకుండా ఫస్ట్ కాపీ ఇచ్చేసారు. నేను ట్రిమ్ చేసుకుంటా అన్నా కూడా వినలేదు.

ఆ రోజు ప్రసాద్ ల్యాబ్ లో ఏడ్చాను అంటూ చెప్పాడు. ఇక రణం సినిమా సమయంలో గోపీచంద్ కు ఒక తండ్రి కొడుకుల కథ చెప్పాను. కొన్ని రోజుల తరువాత చూస్తే శంఖం సినిమా పేరుతో గోపీచంద్, సత్యరాజ్ కాంబినేషన్ లో తండ్రి కొడుకులుగా సినిమా వచ్చింది. పోస్టర్ చూసి చాలా షాక్ అయ్యాను. గోపీచంద్ కి కథ చెబితే ఇలా చేసాడేమిటి అని బాధేసింది. కథ బాగుంది మనం చేద్దాం అని చెప్పిన గోపీచంద్ వేరే వాళ్లతో ఇలా సినిమా చేయడంతో బాధేసింది. అడుగుంటే నేనే చేసేవాడిని కదా అంటూ చెప్పారు. ఇండస్ట్రీ లో చాలా మంది నన్ను మోసం చేసారు అంటూ చెప్పాడు అమ్మ రాజశేఖర్.

Bhargavi

Recent Posts

పిల్లలకు బెస్ట్ హెల్తీ స్వీట్ ఐడియా ఇదే.. పాలు, బెల్లంతో సూపర్ టేస్ట్.. సింపుల్ హోమ్ రెసిపీ!

ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…

3 hours ago

నిద్రలో లేచి తింటున్నారా? సాధారణమా లేక ఆరోగ్య సమస్యా?

అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…

3 hours ago

వేసవిలో శరీరానికి కూలింగ్ కావాలా?దాహం, అలసటకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇదే!

వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…

4 hours ago

ఖాళీ కడుపుతో వాకింగ్.. నిజంగా మంచిదేనా?

దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…

4 hours ago

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 days ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 days ago