Nandamuri Kalyan Chakravarthy: తారకరత్న అంత్యక్రియలలో పాల్గొన్న ఒకప్పటి ఈ నందమూరి హీరోని గుర్తుపట్టారా?

Nandamuri Kalyan Chakravarthy: నందమూరి కుటుంబ సభ్యులలోఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నందమూరి తారక రత్న మరణించడంతో ఒక్కసారిగా ఈ కుటుంబంలో విషాదఛాయలో అలముకున్నాయి. ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు మొత్తం తరలివచ్చారు.

ఈ క్రమంలోనే ఈయన అంత్యక్రియలలో ఒకప్పటి హీరో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఒకానొక సమయంలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఈయన హీరోగా అత్తగారు స్వాగతం’, ‘అత్తగారు జిందాబాద్’, ‘మామా కోడళ్ల సవాల్’, ‘ఇంటిదొంగ’, ‘అక్షింతలు’, ‘కృష్ణ లీల, ’ రౌడీ బాబాయ్’, ‘దొంగ కాపురం’, ‘లంకేశ్వరుడు’ వంటి సినిమాలలో నటించారు.

అనంతరం ఇండస్ట్రీకి దూరమై ప్రస్తుతం బిజినెస్లలో స్థిరపడ్డారు. ఇలా కళ్యాణ్ చక్రవర్తి చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఈయన తారకరత్నకు బాబాయ్ వరుస అవుతారు. కళ్యాణ్ చక్రవర్తి సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు కుమారుడు. ఇలా ఎన్టీఆర్ వారసుడిగా ఈయన కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించారు.

Nandamuri Kalyan Chakravarthy: బిజినెస్ రంగంలో స్థిరపడిన కళ్యాణ్ చక్రవర్తి…

అయితే సినిమాలలో అవకాశాలు తగ్గిపోవడంతో కళ్యాణ్ చక్రవర్తి బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. దీంతో ఈయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా చాలాకాలం తర్వాత కళ్యాణ్ చక్రవర్తి నందమూరి తారకరత్న మరణించడంతో ఈయన హైదరాబాద్ వచ్చారు. ఇలా తారకరత్న అంత్యక్రియలలో ఈయన పాల్గొనడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.