Nandamuri Kalyan Chakravarthy: నందమూరి కుటుంబ సభ్యులలోఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నందమూరి తారక రత్న మరణించడంతో ఒక్కసారిగా ఈ కుటుంబంలో విషాదఛాయలో అలముకున్నాయి. ఈ క్రమంలోనే నందమూరి తారకరత్న అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు మొత్తం తరలివచ్చారు.
ఈ క్రమంలోనే ఈయన అంత్యక్రియలలో ఒకప్పటి హీరో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఒకానొక సమయంలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఈయన హీరోగా అత్తగారు స్వాగతం’, ‘అత్తగారు జిందాబాద్’, ‘మామా కోడళ్ల సవాల్’, ‘ఇంటిదొంగ’, ‘అక్షింతలు’, ‘కృష్ణ లీల, ’ రౌడీ బాబాయ్’, ‘దొంగ కాపురం’, ‘లంకేశ్వరుడు’ వంటి సినిమాలలో నటించారు.
అనంతరం ఇండస్ట్రీకి దూరమై ప్రస్తుతం బిజినెస్లలో స్థిరపడ్డారు. ఇలా కళ్యాణ్ చక్రవర్తి చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఈయన తారకరత్నకు బాబాయ్ వరుస అవుతారు. కళ్యాణ్ చక్రవర్తి సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు కుమారుడు. ఇలా ఎన్టీఆర్ వారసుడిగా ఈయన కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించారు.
అయితే సినిమాలలో అవకాశాలు తగ్గిపోవడంతో కళ్యాణ్ చక్రవర్తి బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. దీంతో ఈయన ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా చాలాకాలం తర్వాత కళ్యాణ్ చక్రవర్తి నందమూరి తారకరత్న మరణించడంతో ఈయన హైదరాబాద్ వచ్చారు. ఇలా తారకరత్న అంత్యక్రియలలో ఈయన పాల్గొనడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…