బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో నిలబడి స్టార్ హీరోలుగా మారారు.. వారిపై ఓ లుక్కేద్దాం..!

టాలెంట్ అనేది ఒకరి సొంతం కాదు. ఎవరికి ఉండే టాలెంట్ వారికి ఉంటుంది. అయితే టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు.. దానికి ఎంతో కొంత సపోర్ట్ ఉండాలి… అలా అయితేనే సినిమాలో ఎంట్రీ ఇవ్వగలరు. ఇది గత కన్ని దశాబ్దాల నుంచి వస్తోంది. కానీ బ్యాగ్రౌండ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా సొంతంగా వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడి సినిమా రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు.

ఇలా గత పదేళ్లలో అన్ని ఇండస్ట్రీలలో కొందరు హీరోలు ఇది నిరూపించారు. కేవలం తమ టాలెంట్‌తోనే సత్తా చూపించారు. ఇలా తెలగు, కన్నడ, తమిళం, మళయాళం నుంచి హిందీ వరకు ఇండస్ట్రీలో తమ టాలెంట్ ను ఉపయోగించి హీరోలుగా నిలబడ్డారు. మరి అలాంటి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగులో మొదటగా చెప్పుకునే వ్యక్తి హీరో నాని. అష్టా ఛమ్మాతో వచ్చిన ఈ హీరో.. తన నటనతో మెప్పించి తను అంటే ఏంటో నిరూపించుకొని స్టార్ హీరోగా నిలబడ్డాడు.

తెలుగులో మరో హీరో.. విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో ఎట్రీ ఇచ్చి తన టాలెంట్ నిరూపించుకొని .. అర్జున్ రెడ్డితో ఓ ఫేమ్ సంపాదించుకున్నాడు.

ఇలా వచ్చిన మరో వ్యక్తి విజయ్ సేతుపతి. ధనుష్ లాంటి హీరోల సినిమాల్లో సైడ్ కారెక్టర్స్ చేసేవాడు. అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగాడు. కానీ ఈ రోజు విజయ్ సేతుపతి డేట్స్ కోసం నిర్మాతలు చెప్పులరిగేలా తిరుగుతున్నారు.

కన్నడ సినిమా ఇండస్ట్రీలో వారసులను తట్టుకొని మరి కేజీఎఫ్ తో మంచి పేరు తెచ్చుకన్నాడు యశ్.

తమిళం నుంచి మరో హీరో శివ కార్తికేయన్. యాంకర్ స్థాయి నుంచి స్టార్ హీరోగా మారాడు శివ. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారిలో మరో వ్యక్తి నివిన్ పోలిశెట్టి కూడా. బాలీవుడ్ లో తనకంటూ మంచి ఫేమ్ తెచ్చుకున్న మరో స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా.