బెల్లంలో అనేక పోషక విలువలు ఉంటాయి.. అయినా కూడా చాలామంది పంచదారనే ఇష్టపడుతుంటారు. పంచదారకు ఉన్నంత డిమాండ్ బెల్లానికి ఉండదు. దానికి గల కారణం పంచదార మనకు పలుకుల రూపలంలో లభించడమే. అందుకే ఎక్కువగా పంచదారను ఇష్టపడతారు. పలుకులుగా ఉండటంతో దానిని సలుభంగా ప్యాకింగ్ చేసి ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లే విధంగా ఉటుంది. అందుకనే దీనిపై మక్కువ ఉంటుంది.
అయితే బెల్లాన్ని కూడా పలుకుల రూపలంలో ఉత్పత్తి చేసేందుకు ఇటీవల అనకాపల్లిలోని ANGRAU యూనివర్సిటీలోని రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ లో ఒక టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీనిపై పేటెంట్ హక్కును కూడా పొందారు. దీంతో దీనికి కావాల్సిన మెషినరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ టెక్నాలజీని 5 కంపెనీలకు నాన్-ఎక్స్‌క్లూజివ్ ప్రాతిపదికన బదిలీ చేసింది.
వోవెల్ టెక్నాలజీస్(మహారాష్ట్ర), చక్రవర్తి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్(తిరుపతి), కెవిఎల్ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్(సికింద్రాబాద్), జయలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్(సికింద్రాబాద్), శుభం ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(విశాఖపట్నం) కంపెనీలు గ్రాన్యులర్ రూపంలో బెల్లాన్ని ఉత్పత్తి చేయడానికి సిద్ధమవుతున్నాయి.
చక్కెర కంటే బెల్లం శ్రేష్టమైనదని.. అనకాపల్లిలోని RARS లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ గా వ్యవహరిస్తున్న డా. పీ.వీ.కే జగన్నాధరావు తెలిపారు. దీనిలో సూక్రోజ్ తో పాటు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయని వివరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం PMFME కింద బెల్లం ఉత్పత్తిని పెంచడానికి ఇంక్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…