పాముకు విషం ఉంటుంది.. కాటేస్తే ప్రమాదం కూడా ఉంటుందని చాలా మందికి తెలుసు. అయినా చాలామంది వాటిని సరదాగా ఆటపట్టిద్దామని అనుకుంటారు. అది కాస్త బెడిసి కొట్టి అనార్థాలకు దారి తీస్తుంది. ఇలా ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా హద్దు దాటితే మాత్రం ప్రమాదంలో చిక్కుకోవడం ఖాయం.
అలానే నోరులేనిదే కదా.. ఏం చేస్తుందని ఆడిద్దామని అనుకుంటే జంతువైనా ఒళ్ళు మండిందంటే మనపని పడుతుంది. ఇక పాములాంటి విషసర్పం అయితే ఏం చేస్తుంది.. కచ్చితంగా కేటేస్తుంది. అసలు విషయం ఏంటంటే.. లుంగీ ధరించి ఉన్న వ్యక్తి పామును పట్టుకొని ఆడిద్దాం అనుకున్నారు. ఎలాగోలా తోకను దొరికిచ్చుకున్నాడు. తల కోసం ప్రయత్నించాడు.
పదే పదే తల దొరికిచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఆ వీడియో తన స్నేహితుడు అక్కడ నుంచి తీస్తున్నాడు. ఆ పాము చాలాసేపు అటూ ఇటూ ఆడింది. ఒక్కసారిగా పాము బుసకట్టినట్లు కొట్టింది. తను ధరించిన లుంగీకి తన పంటితో గట్టిగా పట్టుకుంది. అతడు కంగారు పడి పక్కనే దొరికిన ఓ పుల్లతో కొట్టడం చేశాడు. కానీ అది లుంగీ నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అతడు ఇంకా భయపడి పోయాడు. ఏం చేయాలో అతడికి అర్థం కాక.. అతడు ధరించిన లుంగీ విప్పేసి పరుగో పరుగు.
ఈ వీడియోను గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తన స్నేహితుడు అప్ లోడ్ చేశాడు. కానీ ఇప్పుడు అది వైరల్ గా మారింది. దానిని వీడియో తీస్తున్న తన స్నేహితుడు కూడా నవ్వు ఆపుకోలేక పోయాడు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఈ వీడియో చూస్తే మీకు నవ్వాగదు. మరి మీరు కూడా ఆ వీడియోను చేసి.. సరదాగా నవ్వుకోండి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…