General News

ఎల్ ఐసీలో రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టండి.. రూ.27 లక్షలు పొందండి..!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) గత కొన్ని నెలల నుంచి అనేక రకాలు పథకాలను ప్రవేశపెడుతూ ఉంది. వీటిలో డబ్బులను పొదుపు చేయడం వల్ల కుటుంబ ఆర్థిక భద్రతతోపాటు ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు. దీనిలో ఓ పథకం గురించి తెలుసుకుందాం. అదే సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ టేబుల్ నంబర్ 917. దీనిలో ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు చివరికి భారీ మొత్తాన్ని రిటర్న్‌గా తీసుకోవచ్చు. ఇది ఒక ఫిక్స్ డ్ డిపాజిట్ తో సమానంగా మనం చూడొచ్చు. ఈ పాలసీని 90 రోజుల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు తీసుకోవచ్చు.

గరిష్ట వయో పరిమితి మాత్రం 65 సంవత్సరాలు. ఓ 35 సంవత్సరాలు ఉన్న ఓ వ్యక్తి 25 సంవత్సరాల మెచ్యూరిటీ కాలానికి.. రూ.10 లక్షల సమ్ అస్యూర్డ్ పాలసీని తీసుకున్నారనుకుందాం. అతడు 25 సంవత్సరాలకు రూ.రూ. 4,67,585 చెల్లించాల్సి ఉంటుంది. ఇది చెల్లించాల్సిన సింగిల్ ప్రీమియం. పాలసీ 25 ఏళ్ల తర్వాత అతడు.. ​​ పాలసీలో హామీ మొత్తం రూ .10,00,000, రూ .12,75,000 వెస్ట్ రివిజినరీ బోనస్ కింద పొందుతాడు.

అంటే మొత్తం రూ .27,25,000 పొందుతాడు. అదే FD లో అయితే.. రూ. 4,67,585 కు 6.5 శాతం వడ్డీతో 25 సంవత్సరాలకు రూ.25,43,773 వస్తాయి. అంటే సింగిల్ ప్రీమియం పాలసీ ప్లాన్ నంబర్ 917 పై FD కంటే ఎక్కువ ప్రయోజనాన్ని అతడు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనిని FD తో సరిపోల్చండి. సింగిల్ ప్రీమియం పాలసీని FD తో 6.5% వడ్డీ రేటుతో సరిపోల్చండి. రాజేష్ తన మొత్తం డబ్బును 4,67,585 రూపాయల FD లో డిపాజిట్ చేసాడు అనుకుందాం.

రాజేష్ 25 సంవత్సరాలు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఇంత డబ్బు వేస్తే, చివరికి అతనికి రూ .25,43,773 వచ్చేది. కానీ ఒకే ప్రీమియం పాలసీలో, అతను రూ .27,25,000 పొందాడు. దీని ప్రకారం, సింగిల్ ప్రీమియం పాలసీ ప్లాన్ నంబర్ 917 పై FD కంటే ఎక్కువ ప్రయోజనాన్ని రాజేష్ పొందుతున్నారు. ఈ పాలసీలో పన్ను మినహాయింపు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. సెక్షన్ 80 సి కింద మినహాయించబడింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago