లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) గత కొన్ని నెలల నుంచి అనేక రకాలు పథకాలను ప్రవేశపెడుతూ ఉంది. వీటిలో డబ్బులను పొదుపు చేయడం వల్ల కుటుంబ ఆర్థిక భద్రతతోపాటు ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు. దీనిలో ఓ పథకం గురించి తెలుసుకుందాం. అదే సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్ టేబుల్ నంబర్ 917. దీనిలో ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు చివరికి భారీ మొత్తాన్ని రిటర్న్‌గా తీసుకోవచ్చు. ఇది ఒక ఫిక్స్ డ్ డిపాజిట్ తో సమానంగా మనం చూడొచ్చు. ఈ పాలసీని 90 రోజుల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు తీసుకోవచ్చు.

గరిష్ట వయో పరిమితి మాత్రం 65 సంవత్సరాలు. ఓ 35 సంవత్సరాలు ఉన్న ఓ వ్యక్తి 25 సంవత్సరాల మెచ్యూరిటీ కాలానికి.. రూ.10 లక్షల సమ్ అస్యూర్డ్ పాలసీని తీసుకున్నారనుకుందాం. అతడు 25 సంవత్సరాలకు రూ.రూ. 4,67,585 చెల్లించాల్సి ఉంటుంది. ఇది చెల్లించాల్సిన సింగిల్ ప్రీమియం. పాలసీ 25 ఏళ్ల తర్వాత అతడు.. పాలసీలో హామీ మొత్తం రూ .10,00,000, రూ .12,75,000 వెస్ట్ రివిజినరీ బోనస్ కింద పొందుతాడు.
అంటే మొత్తం రూ .27,25,000 పొందుతాడు. అదే FD లో అయితే.. రూ. 4,67,585 కు 6.5 శాతం వడ్డీతో 25 సంవత్సరాలకు రూ.25,43,773 వస్తాయి. అంటే సింగిల్ ప్రీమియం పాలసీ ప్లాన్ నంబర్ 917 పై FD కంటే ఎక్కువ ప్రయోజనాన్ని అతడు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనిని FD తో సరిపోల్చండి. సింగిల్ ప్రీమియం పాలసీని FD తో 6.5% వడ్డీ రేటుతో సరిపోల్చండి. రాజేష్ తన మొత్తం డబ్బును 4,67,585 రూపాయల FD లో డిపాజిట్ చేసాడు అనుకుందాం.
రాజేష్ 25 సంవత్సరాలు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఇంత డబ్బు వేస్తే, చివరికి అతనికి రూ .25,43,773 వచ్చేది. కానీ ఒకే ప్రీమియం పాలసీలో, అతను రూ .27,25,000 పొందాడు. దీని ప్రకారం, సింగిల్ ప్రీమియం పాలసీ ప్లాన్ నంబర్ 917 పై FD కంటే ఎక్కువ ప్రయోజనాన్ని రాజేష్ పొందుతున్నారు. ఈ పాలసీలో పన్ను మినహాయింపు సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. సెక్షన్ 80 సి కింద మినహాయించబడింది.































