చేతులు లేకపోయినా ఓ వ్యక్తి కష్టపడి చదివి కాళ్లతో పరీక్ష రాసి పాస్ అయ్యాడు. పాస్ కావడమే కాదు.. పరీక్షల్లో 70 శాతం మార్కులు కూడా తెచ్చుకున్నాడు. అందరికీ ఎంతో స్పూర్తిని ఇస్తున్న ఈ యూపీ కుర్రాడి గురించి ఇప్పడు తెలుసుకుందాం. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా కష్టపడటానికి కొందరు బద్దకం చూపిస్తుంటారు. ఈ రోజు పూర్తి చేయాల్సిన పనిని వాయిదాలు వేస్తూ ఉంటారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి చెందిన తుషార్ విశ్వకర్మ చేతులు లేకపోయినా జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన అతడికి ఉండేది. అతడు క్రియేటివ్ కాన్వెంట్ లో 12వ తరగతి చదువుతున్నాడు. అతడికి పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. దీంతో కాళ్లతో రాయడం ప్రాక్టీస్ చేసి స్కూల్లో కూడా చేరాడు. కాళ్లతోనే రాస్తూ అన్ని తరగతులూ పాసయ్యాడు.
ప్రస్తుతం సీబీఎస్ఈ విడుదల చేసిన ఫలితాల్లో 70 శాతం మార్కులు సంపాదించాడు తుషార్. చేతులు లేవనే బాధ ఒకవైపు తోస్తున్నా.. తన ఇద్దరు అన్నలు బడికి వెళ్లి చదువుతుంటే తను కూడా చదవాలనే పట్టుదలతో ఉండేవాడు. అలా చేతులతో కాకుండా కాళ్లతో రాయడం ప్రాక్టీస్ చేశాడు. అలా అతడికి అలవాటు అయిపోయింది.
వేగంగా రాయడానికి రోజుకు ఆరు గంటల పాటు రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడంట. పరీక్షల సమయంలోనూ తన ఇబ్బందిని గమనించి కింద కూర్చొని రాసేందుకు అనుమతినిచ్చిన ఇన్విజిలేటర్లకు అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయం కాస్త అందరికీ తెలియడంతో అతడి పట్టుదలను అందరూ ప్రశంసిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…