Featured

మేక పాలతో ఎన్నో అద్బుతాలు.. తెలిస్తే అస్సలు వదలరు..!

పాలలో అనేక రకాల పోషక గుణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మేక పాలలో అనేక రకాలు ఉపయోగాలు ఉన్నాయి. మాంసకృత్తులు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు కాల్షియం అధికంగా ఉన్నందున మేకపాల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. మేకపాలలో ఉండే అధిక ప్రోటీన్ పరిమాణం మరియు ప్రభావంతమైన పోషకలు, అవసరమైన కొవ్వులు ఆమ్లాలు వాటిని ఒక తృప్తినిచ్చే ఆహారంగా కూడా చేస్తాయి. ఆవు పాల కంటే మేకపాలు కడుపు నిండిన భావాన్ని వేగంగా కలిగిస్తాయని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైంది. దీంతో బరువు తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది.

తిన్న ఆహారం మంచిగా జీర్ణం కావడానికి కూడా మేక పాలు ఉపయోగపడతాయి. అంతే కాకుండా మేక పాలను స్కిన్ కేర్ ఉత్పత్తులు, బాత్ సబ్బులు, క్రీములు, లోషన్లలో వాడుతున్నారు. ఆవు పాల కంటే ఎక్కువగా ప్రయోజనం దీనిలో ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరగడానికి కూడా మేకపాలు ఎంతో ఉపయోగపడతాయి. వాటిలోని సెలెనియం వ్యాధినిరోధక శక్తికి బలాన్ని ఇస్తుంది. అందుకే మహాత్మాగాంధీ కూడా మేకపాలు తాగేవారు.

ఓసారి ఆయన విదేశాలకు వెళ్తూ… వెంట మేకల్ని కూడా తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఎముకలు గట్టిగా తయారు కావడానికి కూడా మేకపాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. చర్మానికి సంబంధించి వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. మేకపాలను ఈ రోజుల్లో మనం టెట్రా ప్యాకెట్లల్లో చూస్తుంటాం. పాల పొడి రూపంలో కూడా లభిస్తున్నాయి.

వాటిలో కాస్త ధర ఎక్కువైనా నాణ్యమైనవి ఆర్డర్ ఇచ్చుకోవడం మేలని నిపుణులు చెబుతున్నారు. మేకపాలవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ పాలు కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా పచ్చి మేకపాలను సేవిస్తే ఆ దుష్ప్రభావాలు కలుగుతాయి. విరేచనాలు, వికారం, కడుపు తిమ్మిరి లాంటివి సంభవిస్తాయి. మేక పాలను వేడి చేయకుండా అలాగే పచ్చిపాలు తాగడంవల్ల నష్టాలు వాటిల్లి ఆసుపత్రిలో చేరడానికి కారణం కావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పచ్చి మేకపాలు వాడకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

2 hours ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

2 hours ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

2 hours ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

2 hours ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

2 hours ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

3 hours ago