అప్పుడప్పుడు బాత్ రూమ్ లో కొంతమంది గుండెపోటు వచ్చి చనిపోతున్న వార్తలు ఇటీవల వింటున్నాం. బాత్ రూమ్‌లో స్నానం చేస్తున్న సమయంలోనో లేక మల విసర్జన చేస్తున్న సమయంలోనో హార్ట్ ఎటాక్ వస్తుంది. అసలు బాత్ రూమ్ లో గుండెపోట్లు ఎక్కువగా ఎందుకొస్తాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ పెద్దగా అవగాహన ఉండదు. ఆ పరిస్థితిని నివారించే అవకాశముందా.. గుండెపోటు మీద పరిశోధన చేస్తున్న NCBI మార్కెటింగ్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం.. 10 నుంచి 11 శాతం వరకు బాత్రూంలోనే ఎక్కువగా హార్ట్ ఎటాక్ లు బాత్ రూమ్‌లో ఉన్న సమయంలోనే సంభవిస్తుంటాయని వెల్లడించింది.
శరీర, రక్తపు ఉష్ణోగ్రతలకు గుండెపోటుకు దగ్గర సంబంధముంది. హృద్రోగ వైద్య నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణం నీటి ఉష్ణోగ్రతలే. చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే స్నానం చేసేటపుడు ఓ చిన్న జాగ్రత్త పాటిస్తే గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు.
నీళ్లు మొదట ఎట్టి పరిస్థితుల్లో తలమీద పోసుకోకూడదు. తలమీద నీళ్లు మొదట పోసుకోవడం వల్ల శరీరం హఠాత్తుగా ఉష్ణోగ్రతల్లో మార్పు చోటుచుసుకుంటుది. ఆ మార్పుకి శరీరం తట్టుకోలేదు. తలమీద చన్నీళ్ళు పడగానే వేడి నెత్తురు ఒక్కసారిగా పైకి అంటే తలభాగంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది.దీంతో రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి గుండె లేదా మెదడు స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తల, పాదాలు మినహా మిగతా శరీర భాగాలను ముందు నీళ్లతో తడుపుకోవాలి. చివరగా తల మీద నీళ్లు పోసుకోవాలి. ఇలా చేస్తే గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు.
మలబద్దకం ఉన్న వారికి కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. మల విసర్జన కోసం కష్టపడుతున్న నేపథ్యంలో గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీంతో గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. బాత్రూంకి వెళ్లినప్పుడు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకూడదు. ఒత్తిళ్లు కూడా బాత్ రూమ్‌లో హార్ట్ ఎటాక్ రావడానికి మరో ప్రధాన కారణం అని హెల్త్ టైన్ డాట్ కామ్ పేర్కొంది. ముఖ్యంగా బీపీ, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, మెగ్రైన్ ఉన్న వారికి పైన చెప్పిన చిట్కా పాటిస్తే ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…