Movie News

కార్తికదీపం : అంజి ఆచూకి కోసం ఒకే కారులో దీప.. మోనిత.. టెన్షన్ లో డాక్టర్ బాబు..!

బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. గత ఎపిసోడ్ లో అంజి ఆచూకీ దొరకడంతో దీప, మోనిత అంజిని పట్టుకోవడానికి బయలుదేరుతారు.ఈ క్రమంలోనే దీప తన పిన్ని దగ్గరికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి అంజి కోసం బయలుదేరుతుంది. ఈ క్రమంలోని ఈరోజు1108 వ ఎపిసోడ్ లోకి ఎంటరైన కార్తీకదీపం సీరియల్ లోని హైలెట్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

అంజి సూర్యాపేటలో ఉన్నాడని తెలుసుకున్న దీప,మోనిత ఎలాగైనా అంజిని పట్టుకుంటే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని బయలుదేరుతారు. అంజి ఆచూకీ దొరకడంతో మోనిత ఎంతో సంతోషంతో డ్రైవ్ చేసుకుంటూ అంజి కోసం బయల్దేరుతుంది. ఈ క్రమంలోనే తన మనసులో చేజారిపోయాయి అనుకున్న అంజిగాడు దొరికాడు. వాడిని వదిలి పెట్టకూడదు మాట విన్నాడో సరే.. లేదంటే దీనికి పని చెప్పాల్సి ఉంటుంది అంటూ తుపాకీ చేతిలో పట్టుకుంటుంది.

సూర్యాపేటకు వెళ్తున్న దీపతో క్యాబ్ డ్రైవర్ ఏంటక్కా ఈ సమయంలో ఒంటరిగా వెళుతున్నావు అని అడిగాడు. అందుకు దీప నువ్వు ఉన్నావు కదా తమ్ముడు తోడుగా అంటూ సమాధానం చెబుతుంది. అంత అర్జెంట్ పని ఏముంది అని అడగగా.. నువ్వు వారణాసి మాదిరిగానే నాకు ఇంకో తమ్ముడు ఉన్నాడు అతనిని కలవాలి.నామాదిరి వారణాసి లాగా అంటే నువ్వు ఫోన్ చేయగానే నీ దగ్గరికి వస్తారు కదా అక్క.. కానీ ఏదో ముఖ్యమైన పని ఉండే ఉంటుంది అనుకుని ఇక ఏ వివరాలు అడగను అంటూ కారు నడుపుతాడు.

దీప ఉదయాన్నే వస్తానని చెప్పిన కార్తీక్ కలవర పడుతుంటాడు. అసలు దీప ఏం చేస్తుంది అని ఆలోచిస్తుండగా అప్పుడే భాగ్యం నుంచి ఫోన్ వస్తుంది. బాబు కాస్త దీపకి ఫోన్ ఇవ్వు అని అడగగా కార్తీక్ షాక్ అవుతాడు. నిజం చెప్పితే ఉదయం లేవగానే ఫోన్ చేయిస్తా అని చెబుతాడు. తన పిన్ని ఇంటికి వెళ్తాను అని చెప్పిన దీప అక్కడికి వెళ్లకుండా ఏం చేస్తుంది..మోనిత ఇంటికి వెళ్లిందా అక్కడ ఏం గొడవ జరుగుతుందో అంటూ కంగారుపడుతూ..మోనిత ఇంటికి వెళతాడు.అక్కడికి వెళ్ళగానే ప్రియమణి అమ్మ గారు లేరు రేపు ఉదయం వస్తానని చెప్పి వెళ్లారు అనడంతో కార్తీక్ లో కంగారు పుడుతుంది.

ఇక కారు నడుపుకుంటూ మోనిత ఒరేయ్ అంజి నిన్ను ట్రంపు కార్డుల వాడుకోవాలని చూస్తుంది ఏసిపి రోషిని. నా మాట వింటే సరే లేదంటే నీ ప్రాణాలు తీస్తా అంటూ మనసులో అనుకోని బయలుదేరుతుంది. ఎలాగైనా నిన్ను ఫామ్ హౌస్ లో కట్టిపడేసి కార్తిక్ తో నా పెళ్లి జరిగేలా చూడాలి అని మనసులో అనుకుంటూ ఉండగా కారు రిపేర్ వచ్చి ఆగిపోతుంది. కారు ఆగిపోవడంతో ఎలాగైనా ముందు వెళ్ళాలి లేకపోతే ప్రోబ్లం అవుతుందనే ఉద్దేశ్యంతో అందరిని లిఫ్ట్ అడుగుతుంది. ఇదే క్రమంలో దీప సూర్యాపేట వెళ్తున్న కారు అదే దారిలో వెళ్తునడటంతో ఆ కార్ ఆపి లిఫ్ట్ అడుగుతుంది మొనిత. అయితే ముందుగానే డ్రైవర్ కు కారులో నేను ఉన్నానని చెప్పకుండా ఎక్కడికి వెళ్తుందో కనుక్కో.. మనం విజయవాడ వెళ్తున్నాం అని చెప్పు అని చెబుతుంది దీప.

ఈ క్రమంలోనే కారు ఆపగానే సూర్యాపేట వరకు లిఫ్ట్ ఇమ్మని అడుగుతుంది మొనిత. డ్రైవర్ సరే ఎక్కండి అని ఎక్కించుకుంటాడు. వెనుక సీట్ లో దీప దుప్పటి కప్పుకుని పడుకున్నట్టు నటిస్తుంది. వెనుక ఉన్నది ఎవరని డ్రైవర్ని అడుగుతుంది మోనిత. మా అక్క నిద్రోస్తుందని పడుకుంది అని చెబుతాడు డ్రైవర్. ఈలోపు ఒక ఫోన్ చేసి వీరేశం నేను ఇంకో నలబై నిమిషాల్లో సూర్యాపేట 8 హోటల్ దగ్గరకి వచ్చేస్తాను అని చెబుతుంది. అదంతా వెనుకనుంచి వింటున్న దీప.. వారినీ దీనికి ఇంత నెట్ వర్క్ ఉందా.. ఏసీపీ కి తెలిసిన విషయం వెంటనే దీనికి ఎలా తెలిసిపోయింది అంటూ ఆలోచిస్తుంటుంది.. ఈలోపు కార్తిక్ తన తమ్ముడుతో దీప ఎక్కడికి వెళ్లిందో.. మోనిత కూడా కనిపించడం లేదు.. ఆ రాకాశి మొనిత దీపని ఎం చేస్తుందో అని భయపడుతూ మాట్లాడుతుంటాడు. అక్కడికి ఎపిసోడ్ పూర్తవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago