సాధారణంగా వేశ్య అనే పేరుకు సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో మనకు తెలిసిందే. అలాంటి వారి పట్ల చాలామంది అమర్యాదగా, అగౌరవంగా మాట్లాడుతుంటారు. కానీ చాలా సినిమాలలో మనము ఇలాంటి వేశ్య పాత్రలను చూస్తూ ఉంటాము. ఇలాంటి పాత్రలో నటించడానికి సాధారణ ఆర్టిస్టుల మాత్రమే ముందుకు వచ్చేవారు. ఇక స్టార్ హీరోయిన్స్ అయితే ఇలాంటి సినిమాలు చేయడానికి అసలు సాహసం చేయరు.ఇలాంటి పాత్రలో చేస్తే ఎక్కడ వారి కెరియర్ పై దెబ్బ పడుతుందో అని చాలామంది ఇలాంటి పాత్రలను చేయడానికి వెనకడుగు వేస్తారు. కానీ ఇలాంటి పాత్రలలో చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి అని చెప్పవచ్చు. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఇలాంటి ధైర్యం చేసి వేశ్య పాత్రలలో నటించారు. మరి వేశ్య పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ స్టార్ హీరోయిన్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం…
1) అనుష్క: అందం అభినయం కేరాఫ్ అడ్రస్ అంటే అనుష్క అని చెప్పవచ్చు.తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క వేదం సినిమాలో వేశ్య పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.
2) ఛార్మి: ప్రేమ ఒక మైకం, జ్యోతిలక్ష్మి వంటి సినిమాలలో చార్మి వేశ్య పాత్ర ద్వారా సందడి చేశారు.
3) శ్రీయ: శ్రియ వేశ్యగా పవిత్ర సినిమాలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.
4) జయప్రద: మేఘసందేశం చిత్రంలో అలనాటి తార జయప్రద వేశ్య పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
6) జయసుధ: ఏఎన్నార్ హీరోగా తెరకెక్కిన ప్రేమాభిషేకం సినిమాలో జయసుధ వేశ్యగా నటించారు.
7) శృతిహాసన్: శృతిహాసన్ వేశ్యగా డీ డే (గెలుపు గోపురం) అనే సినిమాలో వేశ్యగా సందడి చేశారు.
8) స్నేహ: హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న స్నేహ దూల్ పేట చిత్రంలో వేశ్య పాత్రలో అభిమానులను మెప్పించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…